ఆయన ఏపీ టీడీపీ ప్రెసిండెంట్. మంత్రి కూడాను. టీడీపీ పెట్టిన నాటి నుంచి పనిచేస్తున్న నేత. అటువంటి కళా వెంకటరావు ఈసారి ఓటమిపాలు అయ్యారు. టీడీపీ జాతీయ  ప్రెసిడెంట్  చంద్రబాబుకి మెజారిటీ తగ్గిపోయింది. మరో వైపు జాతీయ ప్రధాన  కార్యదర్శి మంత్రి నారా లోకేష్ చాలా దారుణంగా వెనకబడ్డారు. 


ఈ నేపధ్యంలో చూసుకున్నపుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అన్నది తెలుస్తోంది. ఆ పార్టీ పెద్ద తలకాయలు, పార్టీ సారధులే ఓటమి అంచున ఉంటే మిగిలిన నేతల గురించి చెప్పేదేముంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఘోర పరాభవం అంచున టీడీపీ పయనిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: