కృష్ణా జిల్లా కేంద్ర‌మైన మ‌చిలీప‌ట్నం సీటుపై వైసీపీ జెండా ఎగిరింది. ఇక్క‌డ నుంచి మాజీ మంత్రి, వైసీపీ అభ్య‌ర్థి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న మంత్రి కొల్లు ర‌వీంద్ర‌పై 5,190 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇద్ద‌రు యోధులు త‌ల‌ప‌డితే ఎలా ఉంటుంది ? అన్న‌దానికి నిద‌ర్శ‌నంగా నిలిచిన నియోజ‌క‌వ‌ర్గం ఇదే. ఇక్క‌డ నుంచి వరుస‌గా రెండో సారి కూడా గెలిచి తీరాల‌నే క‌సితో ఒకరు. లేదు.. గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్పిపోయిన విజ‌యాన్ని ఎట్టిప‌రిస్థితి లో నూ కైవ‌సం చేసుకునేందుకు మ‌రొక‌రు త‌ల‌ప‌డ్డారు. 


కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత నియో జ‌క‌వ‌ర్గం కావ‌డం, మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇక్క‌డ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నే ఆస‌క్తి పీక్ కు వెళ్లింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి తొలిసారి బ‌రిలో నిలిచిన విద్యావంతుడు, మ‌త్స్య కార వ‌ర్గానికి చెందిన‌ కొల్లు రవీంద్ర విజ‌యం సాధించి చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. తాజా ఎన్నిక‌ల్లో నూ విజ‌యమే ల‌క్ష్యంగా కొల్లు భారీ పోరు చేశారు. ఇక‌, ఇక్క‌డ నుంచి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్య‌ర్థి పేర్ని నాని కూడా హోరా హోరీగా త‌ల‌ప‌డ్డారు.


గ‌త ఎన్నిక‌ల్లో 15 వేల ఓట్ల తేడాతో పోగొట్టుకున్న విజ‌యాన్నికైవ‌సం చేసుకు నేందుకు ఆయ‌న తీవ్ర‌స్థాయిలో పోరు చేశారు. జ‌గ‌న్ మ్యానియా, న‌వ‌ర‌త్నాలు వంటివి త‌న‌కు అనుకూలంగా మార‌తాయ ని ఆయ‌న భావించారు. సామాజిక ప‌రంగాను, ఆర్థికంగానూ ఇద్ద‌రూ బ‌లంగా ఉండ‌డం, ఇద్ద‌రూ వివాదాల‌కు దూరంగా ఉండ‌డంతో పోటీ కూడా అదే స్థాయిలో జ‌రిగింది. చివ‌ర‌కు పేర్ని వెంక‌ట్రామ‌య్య మ‌రోసారి విజ‌యం సాధించారు. గ‌తంలో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న పేర్నిక ఈ సారి జ‌గ‌న్ కేబినెట్‌లోనూ మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంది.


ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన ప్ర‌భావం ఎంతో ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే జ‌న‌సేన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని ఓట్లు చెప్పేశాయి. గెలిచిన పేర్ని నానికి 62,995 ఓట్లు వ‌చ్చాయి. మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు 57,805 ఓట్లు వ‌స్తే... బండి రామ‌కృష్ణ‌కు కేవ‌లం 18 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: