ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలం టార్గెట్ గా పెట్టుకున్నారు. టార్గెట్ దేనికంటే మంచి సిఎంగా అనిపించుకోవటానికట. సిఎంగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆరునుండి ఏడాది లోగా జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకునేలా పనిచేస్తానంటూ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు.

 

పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత తన నివాసం నుండి పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడున్న పార్టీ నేతలు,  కార్యకర్తలను ఉద్దేశించి ఓ పది నిముషాలు మాట్లాడారు. జగన్ ను చూడగానే కార్యకర్తలు అసలు మాట్లాడటినివ్వలేదు. తర్వాత కాస్త సమయం చూసుకుని జగన్ మాట్లాడాల్సొచ్చింది.

 

మొత్తానికి ఈనెల 30వ తేదీన విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు జగన్ స్వయంగా చెప్పారు. ఉదయం తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. మొదటి సంతకం అంటూ ఏమీ లేదని నవరత్నాలు మొత్తాన్ని అమలు చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు.

 

వైసిపి కి ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రజల తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ దశలోను వమ్ము చేయనని కూడా మాటిచ్చారు. పాదయాత్రలో తాను అందరూ కష్టాలని గమనించాను కాబట్టి సుపరిపాలన ఎంటో చూపిస్తానన్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: