దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలో సంచ‌ల‌న ఫ‌లితం వ‌చ్చింది.
పసుపు రైతులు 176 మంది పోటీలో నిలవడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా హాట్ టాపిక్ అయిన  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున ఈ స్థానం నుంచి బ‌రిలో దిగిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, ప్ర‌స్తుత ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప‌రాజ‌యం పాల‌య్యారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఓటమికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు .


రికార్డు స్థాయిలో బ‌రిలో దిగిన నేప‌థ్యంలో, అంద‌రి దృష్టి ఈ స్థానంపై ప‌డింది. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుతో సహా, పసుసు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరపై గతేడాది చివర్లో రైతులు పోరుబాట పట్టారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ రైతులు కొన్ని నెలలపాటు ఆందోళన చేశారు. తమ సమస్యలన్నీ దేశానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా నిజామాబాద్ బరిలో నిలిచారు. పసుపు బోర్డు అంశం రాష్ట్ర పరిధిలోనిది కాకపోయినా…గిట్టుబాటు ధరపై రైతులతో రాష్ట్ర ప్రభుత్వం తరపున  మాట్లాడింది లేదు. ఎవరు పోటీ చేసిన గెలుపు తమదేనన్న ధీమాతో..రైతుల్ని టీఆర్ఎస్ పట్టించుకోలేదన్న వాదనలున్నాయి. 

ఈ అంశాన్ని బీజేపీ క్యాచ్ చేసింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్..పక్కా ప్లాన్ తో ముందుకెళ్లారు. కేంద్ర నాయకులతో నిజామాబాద్ లో సభలు పెట్టించారు. అవి బాగానే వర్కవుట్ అయినట్టు ఫలితాలతో తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ కూడా బీజేపీకే మద్దతిచ్చినట్టు లోకల్ గా చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే నిజామాబాద్ ఓటమి కవితది కాదు…కేసీఆర్ దేనని చెప్తున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: