ఆత్మకూరు మొదటి నుంచి వైస్సార్సీపీ కంచుకోటగా ఉందని చెప్పాలి. దానికి తగ్గట్టుగానే వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి ఘన విజయాన్ని సాధించారు. గౌతమ్ రెడ్డి మీద టీడీపీ నేత బొల్లినేని కృష్ణయ్య పోటీ చేశారు. బొల్లినేని మంచి పేరు ఉన్నప్పటికీ, డబ్బులు బాగా ఖర్చు చేసినప్పటికీ ఆ నియోజక వర్గం వైసీపీకి కంచుకోటగా ఉండటంతో గెలవలేకపోయారని చెప్పొచ్చు. 


అయితే ఆత్మకూరు వాసులు జగన్ ను చూసి ఓట్లు వేశారని చెప్పాలి . కాబట్టి ఈ సారి  గౌతమ్ రెడ్డి విజయం నల్లేరు మీద నడక లాంటిదని అప్పుడే తెలిసి పోయింది . అయితే టీడీపీకి ఈ నియోజక వర్గం మీద అంత పట్టు లేకపోవటం మరో మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది ఇంచార్జిలు మారటంతో గెలుపు అవకాశాలు సంక్లిష్టం అయినాయి.


ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీ లోకి జంప్ అవ్వటం తో పార్టీ క్యాడర్ కూడా వైసీపీ లోకి జంప్ అయ్యింది. దీనితో వార్ వైసీపీ వన్ సైడ్ అయిపోయిందని చెప్పాలి. అయితే బొల్లినేని కృష్ణయ్య పోటీ చేయడంతో అతను ఇక్కడ కచ్చితంగా గెలుస్తాడని టీడీపీ శ్రేణులు భావించారు. అయితే అతను ఓటమి చెందడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పాలి. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: