జనసేన..ఎన్నో అంచనాల మద్యన ప్రారంభించబడిన పారట్ీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ వంటి హేమా హేమీలు, లక్షల సంఖ్యలో ఉన్న మెగా అభిమానులు, దాతల ఆర్థిక అండదండలు, యువత సోషల్ మీడియా సహకారం.


ఇవన్నీ ఉన్నా ఘోరాతి ఘోరంగా కుదేలైందీ పార్టీ.  ఎంత ఘోరంగా అంటే ప్రాంతీయ పార్టీ స్వయానా నాయకుడే ఓటమి పాలయ్యాడు.  ఒక చోట నుండి కాదు.  పోటీ చేసిన రెండు స్థానాల నుంచి అడ్డంగా ఓడిపోయారు.


ఇల్లాంటి పరిస్థితుల్లో కూడా జనసేన అభ్యర్థిగా రాజోలు నుండి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు గెలుపు గుర్రం ఎక్కారు అయితే ఆ గుర్రం జనసేన పార్టీ వైపు కాకుండా సూటిగా ... సుత్తిలేకుండా వైసీపీ పార్టీ ఆఫీసుకే పరుగుతీస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.


పో.. ఏతావాతా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో జనసేన అనే పేరు ఉండకపోవొచ్చు, ఉన్నా ప్రభుత్వానికి తాన-తందాన పాత్రలోనే ఉండవొచ్చు తప్ప పవన్ కళ్యాన్ కలలు కన్న ప్రశ్నించే పార్టీగా ఉండకపోవొచ్చన్నది కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్న సత్యం. మరి మీరేమంటారు.


2019 ఎన్నికల ఫలితాలను క్షణ - క్షణ వివరాలతో మీ ముందుంచుతుంది ఇండియాహెరాల్డ్ గ్రూప్ సంస్థ.


మరింత సమాచారం తెలుసుకోండి: