ఇప్పుడు పవన్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి.  ఒకటి ప్రజాక్షేత్రంలో ఉంది నిత్యం ప్రజలతో మమేకం అవుతూ... ప్రజల సమస్యలపై స్పందించి బయటి నుంచి ప్రభుత్వం ద్వారా పనులు జరిగే విధంగా చూడడం.  రెండోది తిరిగి సినిమా రంగంలోకి వెళ్లి సినిమాలు చేయడం.  ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడి అన్ని రకాలుగా నిలదొక్కుకోవడానికి కనీసం మూడు నాలుగు నెలల సమయం పడుతుంది.  ఆ తరువాత ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తుంది.  


ఈ మూడు నాలుగు నెలలపాటు ప్రతిపక్షంలో ఉండే పార్టీలకు పెద్దగా పని ఉండదు.  ప్రతిపక్షంలో లేని పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉంది ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యొచ్చు.  కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వచ్చిన ప్రభుత్వం ఎలా పోరాటం చేస్తుందో వెయిట్ చేయక తప్పని పరిస్థితి.  అంతేకాదు, ప్రజలు సైతం వెంటనే సమస్యలు తీర్చమని అడగలేరు.

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేయాలి.  గతంలో వచ్చిన సమస్యలపై ఎలా పోరాటం చేయాలని రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి.  ప్రభుత్వం వద్దకు వాటిని ఎలా తీసుకెళ్లాలని ఆలోచించాలి.  ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా పోరాటం చేయాలి అనే దానిపై ఒక ప్లానింగ్ చేసుకోవాలి.  ఇవన్ని చేసుకుంటూ వెళ్ళాలి అంటే పవన్ కు డబ్బు కావాలి.  నాదగ్గర డబ్బు లేదు జీతాలు ఇవ్వడానికే ఇబ్బందులు పడుతున్నా అంటున్నాడు.  అలాంటప్పుడు పవన్ రాజకీయాల్లో ఉంది ఇబ్బందులు ఎదుర్కొంటాడా లేదంటే డబ్బుకోసం తిరిగి సినిమాల్లో నటిస్తాడా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: