శ్రీకాకుళం సీటును మళ్ళీ పదేళ్ళ తరువాత ధర్మాన ప్రసాదరావు కైవశం చేసుకున్నారు. 2009లో ఇక్కడ నుంచి గెలిచిన ధర్మాన 2014 నాటికి వైసీపీలో చేరి పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. ఈ పరిణామంతో క్రుంగిపోయినా పట్టు వదలని విక్రమార్కునిగా ఆయన అయిదేళ్ళ పాటు పరిశ్రమించి గెలుపు తీరాలకు చేరుకున్నారు.


ఇక్కడ 2014 ఎన్నికల్లో అనూహ్యంగా  మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణను కాదని టికెట్ భార్య లక్ష్మీదేవికి ఇచ్చారు. ఆమె మంచి మెజారిటీతో విజయం సాధించడమే కాదు, రాజకీయ ధురంధరుడు ధర్మానని ఓడించేసింది. ఇక దానికి ప్రతీకారం అన్నట్లుగా ధర్మాన ఈసారి తనదైన వ్యూహాలు అమలు చేసి మరీ ఆమెపై నాలుగున్నర వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.


గతంలో లక్ష్మీదేవిని గెలిపిచిన కళింగ కోమట్లు ఈసారి ధర్మాన వైపు నిలబడ్డారు. వారిని తనవైపునకు తిప్పుకోవడమే కాదు, పట్టణంలో ఉన్న ఉద్యోగ, వ్యాపార వర్గాల మద్దతు సంపాదించడం ద్వారా ధర్మన గెలుపు సులువు చేసుకున్నారు.  అంతే కాదు, టీడీపీలోని కొన్ని వర్గాల సహకారం కూడా ధర్మానకు దక్కిందన్న ప్రచారం సాగింది. అది లోపాయికారి అవగాహనగా చెబుతున్నారు.  దాంతో  ఈ హాట్ సీట్లో మళ్ళీ ఆయన కూర్చుండిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: