2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేప‌థ్యంలో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది అఖండ విజ‌య‌మంటూ ఉద్ఘాటించారు. బీజేపీకి 50 శాతానికిపైగా ఓట్లు పోల‌య్యాయంటే ఇది మామూలు విష‌యం కాద‌న్నారు. ఈ తీర్పుతోనే దేశం త‌మ‌పై ఎంత న‌మ్మ‌కం పెట్టుకుందో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని వెల్ల‌డించార‌య‌న‌. దేశంలో కుటుం రాజ‌కీయాల‌కు చోటు లేద‌ని స్ప‌ష్టం చేశారు. 


లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షా.. పార్టీ ప్రధాన కేంద్రంలో బీజేపీ ప్ర‌సంగించారు. కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి మాట్లాడారు. అనంత‌రం అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడ‌పై కూడా సెటైర్లు వేశారు అమిత్ షా. చంద్ర‌బాబు కేంద్ర‌స్థాయిలో బీజేపీని ఓడించేందుకు విపక్ష నేతలను కలవడంపై పెట్టిన శ్రద్ధ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంపై పెట్టి ఉంటే మంచి ఫ‌లితం ఉండేద‌న్ని ఎద్దేవ చేశారు. కొంచెమైనా ఏపీ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తే బాగుండున‌ని అన్నారు. అటు తిరుగుడు.. ఇటు తిరుగుడుకే స‌రిపోయింద‌ని.. ఇక ప్ర‌జ‌ల‌కు సేవ చేసే టైమ్ ఎక్క‌డుందంటూ బాబుకు అమిత్ షా చుర‌క‌లంటించారు. 


ఈ నేప‌థ్యంలో ఏపీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన వైసీపీ అధినే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అమిత్ షా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అటు మ‌రోవైపు పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయ‌ని.. అయినా బీజేపీ 18 స్థానాల్లో గెలిచిందని షా చెప్పుకొచ్చారు.  రాబోయే రాష్ట్రంలో బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: