Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:53 am IST

Menu &Sections

Search

జగన్‌ విజయ రహస్యం ఇదే .?

జగన్‌ విజయ రహస్యం ఇదే .?
జగన్‌ విజయ రహస్యం ఇదే .?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
త్రిముఖ పోటీ జరిగిన ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జగన్‌ సక్సెస్‌ అయ్యారు.
 ఏపీ ప్రజలు మార్పువైపు చూశారు. జగన్‌కి ఒక్క ఛాన్స్‌ ఇచ్చి చూద్దామని ఊహకందని మెజార్టీ ఇచ్చారు.
చంద్రబాబు సర్కారు పై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందని.. అదే తమను గెలిపిస్తుందని వైసీపీ నేతలు చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఈసారి పార్టీ ఓడితే జీవన్మరణ సమస్య అంటూ వైసీపీ నేతలు అంతర్గతంగా చేసిన కృషి కూడా కింది స్ధాయి కార్యకర్తలు పట్టుదలగా పనిచేసేందుకు దోహదం చేశాయి.

వీటితో పాటు పార్టీ అధినేత జగన్‌ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లాయి.
 ప్రజల గుండె తట్టిన పాదయాత్ర
 జగన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం పాదయాత్ర. 2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, 2014 ముందు చంద్రబాబు పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చారు. ఇదే సెంటిమెంట్‌ జగన్‌ను జనానికి దగ్గర చేసింది. ఇడుపులపాయలో మొదలైన 'ప్రజా సంకల్పయాత్ర', 13 జిల్లాల్లో 341 రోజుల పాటు 3,648 కి.మీ సుధీర్గంగా కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విజయవంతంగా ముగిసింది. పాదయాత్రలో దారి పొడవునా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ పాదయాత్రలో ఎక్కువగా వద్ధులు, మహిళలు, యువతతో జగన్‌ మమేకమయ్యారు. యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించడం, బాధతో తన దగ్గరికి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఓదార్చడం వంటి అంశాలు జగన్‌ను ప్రజలకు దగ్గర చేశాయి.

 రైతుకు భరోసా

 వైకాపా గెలుపునకు ప్రధానంగా దోహదపడిన అంశం 'నవరత్నాలు'. ఆరోగ్యశ్రీ, యువత-ఉపాధి,అమ్మ ఒడి, రైతుభరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పింఛన్ల పెంపు, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ గ హనిర్మాణం, బీసీ సంక్షేమం అంశాలను నవరత్నాల్లో పొందుపరిచారు. ముఖ్యంగా పింఛన్ల పెంపు, వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, అమ్మ ఒడి కింద బడికి పిల్లల్ని పంపితే తల్లిదండ్రులకు రూ.15వేల ప్రోత్సాహకం.. ప్రజలను ఆకట్టుకున్నాయి.

 'హోదా'పై ఒకే మాట

ఏపీకి కచ్చితంగా ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ పోరాటాలు చేయడంలో, ఒకే మాటపై నిలబడింది. చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించడం పొరపాటంటూ జగన్‌ తీవ్రంగా ప్రచారం చేసి టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంతో, చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాపై తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది.కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జన్మభూమి కమిటీలపై ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీకి బాగా కలిసొచ్చింది.క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని చేయించుకోవాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులకు ఎంతో కొంత ముట్టజెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ జగన్‌ విస్త తంగా ప్రచారం చేయడం వైసీపీ విజయంలో కీలకంగా మారాయి.

ఆకర్షించిన పెట్టుబడి
సాయం ఏటా పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు రూ.12,500 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని వైసీపీ ప్రకటించింది. అంతేకా, రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచితంగా బోర్లు, 9 గంటల ఉచిత విద్యుత్‌ తదితర అంశాలు రైతన్నలను ఆకర్షించాయి. 
జగన్‌ పై దాడి... 
విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో జగన్‌ పై దాడి జరిగినపుడు ,కనీస మానవత్వంతో సానుభూతి చూపకుండా టీడీపీ నేతలు కోడి కత్తి పార్టీ అంటూ వెటకారాలు చేయడం కూడా జగన్‌కి ప్రజల్లో సానుభూతిని పెంచింది. అదే ఆ పార్టీ విజయావకాశాలకు మరింత పెంచింది.


ap-election-results
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పత్రిక ఎడిటర్‌ ఔట్‌ ...?
జగన్ కి కేశినేని నాని సలహా ?
హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?
'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు ...? ''
అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!
హై టెక్ సిటీలో ఉద్యోగం కావాలా ?
హీరొ రవితేజ ఇక్కడే ఎందుకు భోజనం చేస్తాడో తెలుసా...?
'' వైఎస్‌ జగన్‌ అనే అతడు...'' అని, ఆ పత్రికలో ఎందుకు రాశారంటే..?
జగన్‌ ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఎందుకు వేశారో తెలుసా?
వంద కోట్ల పరువు నష్టం దావా...?
గ్రామ స్వరాజ్యం కోసం,చినజీయర్ స్వామి ?
హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం !!
 ఈ డ్యామ్‌ లేకపోతే, అమెరికాలో పంటలు పండవు... !!
ఆ జర్నలిస్టుల వల్ల ఏపీకి, అరకోటి నష్టం!!
డాక్ట‌ర్ల‌కు 'ల‌య‌న్స్ క్ల‌బ్ ' సంఘీభావం
గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా మందులు!!
 పేద విద్యార్థులకు ఉచిత వసతి, నైపుణ్యశిక్షణ!!
 అర్దరాత్రి   ఐఏఎస్‌ల బదిలీలు !!
త్రినదుల సంఘమం కాళేశ్వరం !!
ఇక్కడ నీళ్లున్నాయ్‌..!! చెన్నైలో ఎందుకు లేవు ?
వెంకయ్య నిజాయితీకి అగ్నిపరీక్ష..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.