పూసపాటి వంశాంకురం, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు తొలిసారి గా విజయనగరం అసెంబ్లీ బరిలో టీడీపీ ఎమ్మెల్యేగా దిగారు. ఈ సీట్లో సీనియర్ గా ఉన్న వైసీపీ నేత కొలగట్ల వీరభద్రస్వామి పోటీ చేశారు. గతంలో తండ్రి అశోక్ ని ఓడించిన కోలగట్ల ఈసారి తనయ అదితిని ఓడించేశారు.


కోలగట్ల ఒక పధకం ప్రకారం ప్రచారం నిర్వహించారు. పట్టుని పెంచుకున్నారు. పార్టీ సహకారంతో పాటు తన వ్యక్తిగత చరిష్మాను కూడా ఆయన ఉపయోగించుకుని విజయాన్ని సాధించారు. ఇక అదితికి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ బాగా తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత తూర్పు కాపు బీసీ. ఆమెను తప్పించి రాజులకు ఈ టికెట్ ఇవ్వడం వల్ల వారంతా కోపంతో వైసీపీకి పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి.


ఇక కోలగట్ల గతంలో ఓసారి ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయనకు రాజకీయంగా అనుభవం ఉండడం, జగన్ కి ఒక చాన్స్ ఇవ్వాలన్న కోరిక ఇవన్నీ కలసి స్వామిని పదిహేనేళ్ళ తరువాత ఎమ్మెల్యేని చేశాయి. ఇక జగన్ మెచ్చిన జనం మెచ్చిన స్వామికి ఏ పదవి వరిస్తుందో చూడాలని అనుచరులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: