అనంతపురం జిల్లా తాడిపత్రి లో జేసీ కుటుంబానికి తిరుగులేదు అనే చెప్పాలి. కానీ ఈసారి పరిస్తితి మారింది, అనూహ్యంగా జేసీ అస్మిత్  రెడ్డి కి ఓటమి ఎదురైంది. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయకేతనం ఎగరేశారు.ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని జేసీ కుటుంబం అస్సలు ఊహించిఉండదు.

చాలా ఏళ్లుగా చక్రం తిప్పిన వీరూ ఇప్పుడు ఓటమి ని చూసారు. ప్రజలు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు అంటే అది జగన్ మేనియ అనే చెప్పాలి.సహజంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి మంచి పలుకుబడి ఉంది. దానికి తోడు ఇప్పుడు జగన్ పార్టీ తోడవడంతో ఆయన విజయం ఖరారు అయిపోయింది. తాను ప్రత్యర్థి గా ఉన్నప్పుడు ప్రజల్లో బాగానే కలిసిపోయాడు. ఆ పరిస్థితులు కూడా బాగా కలిసొచ్చాయి.

ఇప్పుడు తాడిపత్రి లో పాలన మారబోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా చూడాలి . ఎన్నో ఏళ్ళు గా జేసీ కుటుంబం కు కొమ్ము కాస్తున్న ప్రజలు వాళ్ళను కాదని కేతిరెడ్డి కి పట్టం కట్టారు . మరి ప్రజలు తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: