భీమునిపట్నానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గెలిచిన వారి పార్టీ అధికారంలోకి వస్తుంది. టీడీపీకి కంచుకోటలాంటి భీమిలీలో ఇపుడు వైసీపీ జెండా ఎగిరింది. దానికి తోడు ఏపీలో కూడా బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో భీమిలీ సెంటిమెంట్ కొనసాగినట్లు అయింది.


ఇక్కడ నుంచి రెండవ మారు ఎమ్మెల్యెగా గెలిచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అసెంబ్లీకి వెళ్తున్నారు. ఆయన తన ప్రత్యర్ధి సబ్బం హరిని పాతిక వేల ఓట్ల మెజారిటీతో ఓడించడం విశేషం. ఇదే మెజారిటీ ముందే చెప్పుకున్నట్లుగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయ‌ణకు బాగా హెల్ప్ అయింది. ఇదిలా ఉండగా భీమిలీకి మరో సెంటిమెంట్ ఉంది. ఇక్కడ నుంచి నెగ్గిన వారికి విద్యా శాఖా మంత్రి పదవి దక్కుతుందని.
మరి అవంతికి జగన్ మంత్రి పదవి ఇస్తారా అన్నది పెద్ద చర్చగా ఉంది.


ఇదిలా ఉండగా అవంతి వైసీపీలోకి రాకతోనే విశాఖలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ఒక్క భీమిలీలో వచ్చిన కుదుపు చాలా చోట్ల టీడీపీని డిస్టర్బ్ చేసింది. చివరికి ఎంపీ సీటు కూడా టీడీపీ పోగొట్టుకునేందుకు కారణమైంది. సబ్బం హరిని పోటీలో దింపడం ద్వారా టీడీపీ పెద్ద తప్పు చేసిందని తమ్ముళ్ళు ఇపుడు అనుకుంటున్నా వైసీపీ వేవ్ ముందు ఎవరు నిలబడినా ఓటమి తప్పదని తాజా ఫలితాలు నిరూపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: