తొలి సంతకం.. సీఎంగా జగన్ చేసే తొలి సంతకం దేనిపైన..? చాలా ఆసక్తి కలిగించే ప్రశ్నఇది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై ప్రమాణ స్వీకారం వేదికపైనే తొలి సంతకాలు చేశారు. ఇప్పుడు జగన్ ఏ అంశంపై తొలి సంతకం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


దీనికి జగన్.. ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రెస్ మీట్‌లోనే సమాధానం చెప్పారు.. జగన్ ఏమన్నారంటే.. "మొదటి సంతకం నవరత్నాలు అన్నది నేను గట్టిగా నమ్ముతున్నా.. 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాలు చూశా.. వారు చెప్పిన బాధలు విన్నాను. ఆ ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా.. నేను చూశా.. నేను విన్నా.. నేను ఉన్నానని కచ్చితంగా హామీ ఇస్తున్నా.. 

" ఒక్క సంతకం కాదు.. నవరత్నాలను తీసుకొచ్చే పాలన కచ్చితంగా ఇస్తా. ప్రమాణ స్వీకారం విజయవాడలోనే జరుగుతుంది. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని అందించిన ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ప్రజల విశ్వాసం నాపై బాధ్యతను ఇంకా పెంచింది. గవర్నెన్స్‌ అంటే ఏమిటీ.. గొప్ప గవర్నెన్స్‌ అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా" అన్నారు జగన్.

తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నికల ఫలితాలపై వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి గొప్ప విజయం ఎప్పుడూ జరగలేదు. నాకు తెలిసి 25 ఎంపీ స్థానాలు మొత్తం వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకోవడం, 175 నియోజకవర్గాలకు దాదాపు 153పైచిలుకు నియోజకవర్గాలు రిజిస్టర్‌ కావడం ఆంధ్రరాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం. ఈ విజయం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో సాధ్యమైందన్నారు జగన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: