ముఖ్యమంత్రి కాగానే జగన్ ఏంచేస్తారు.. ? చాలామందిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇది. ఇందుకు సమాధానం నేరుగా జగనే చెప్పేశారు. ఆయన తొలి ఏడాదిలో తన టార్గెట్ ఏంటో ఎన్నికల్లో గెలిచిన తొలిరోజే క్లారిటీ ఇచ్చేశారు. 


సీఎం అయిన తొలి ఏడాదిలోనే పరిపాలనలో తన ముద్ర ఏంటో చూపించాలనుకుంటున్నారు. గవర్నెన్స్‌ అంటే ఏమిటీ.. గొప్ప గవర్నెన్స్‌ అంటే ఎలా ఉంటుంది అన్నది ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే జగన్‌ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేలా నా ప్రతి అడుగు వేస్తాను అంటూ తొలిరోజే ధీమాగా చెప్పారు.

"మీ అందరి ఎదుటకు వచ్చి నిల్చొని మాట్లాడగలుతానంటే నిజంగా అది నా అదృష్టం, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలని గర్వంగా చెబుతాను.  ప్రజలు విశ్వసనీయతకు ఓటు వేశారు. విశ్వసనీయత లేని నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు చూపించారు. నాపై ఉన్న విశ్వాసంతో ఓటు వేశారు. ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా.. 5 కోట్ల మంది ప్రజానీకంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనే అవకాశం దేవుడు ఒక్కరికే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం దేవుడి దయ, ప్రజల దీవెనలతో వచ్చిందన్నారు జగన్. 

జగన్ పై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దీనికితోడు జగన్ కూడా నవరత్నాలు ప్రకటించారు.ఆ పథకాలు మాములివి కాదు. వాటి అమలు చేసి ప్రజలను మెప్పించడం అంత సులభమూ కాదు.. కానీ చేయాలన్న ఆలోచన ఉంటే అసాధ్యం కూడా ఏదీ కాదు కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: