ఐదేళ్ళు చంద్రబాబునాయుడు అనైతిక రాజకీయాలతోనే గడిపేశారు. అందులో ప్రధానమైనది ఫిరాయింపు రాజకీయాలకు తెర ఎత్తెటం. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలతో పాటు ముగ్గురు ఎంపిలను కూడా ఫిరాయింపులకు ప్రోత్సహించి లాక్కున్నారు. వైసిపి ఎంత గగ్గోలు పెట్టినా ఇటు చంద్రబాబు అటు స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ లెక్కే చేయలేదు.

 

సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల ఫలితాలు గురువారం వచ్చాయి. అందులో టిడిపికి వచ్చిన సీట్లెన్ని ? ఎన్నంటే ముచ్చటగా 23 కూడా లేవు. అంటే చంద్రబాబు ప్రోత్సహించిన ఫిరాయింపు ఎంఎల్ఏల సంఖ్య కూడా చివరకు దక్కలేదు. వైసిపి నుండి టిడిపిలోకి 23 మంది ఎంఎల్ఏలు ఫిరాయిస్తే చివరకు తాజా ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల సంఖ్య సరిగ్గా 23 కావటం యాధృచ్చికమేమో.

 

ఇక ఎంపిల విషయం చూస్తే అది కూడా దాదాపు సేమ్ టు సేమ్ అలాగే ఉంది. 2014 ఎన్నికల్లో  వైసిపి తరపున గెలిచిన ముగ్గురు ఎంపిలను చంద్రబాబు లాక్కున్నారు. ఐదేళ్ళు తిరిగేసరికి 2019 ఎన్నికల్లో టిడిపికి దక్కిన ఎంపిల సంఖ్య కూడా సేమ్ టు సేమ్. మామూలుగా అయితే వీళ్ళు ముగ్గురు కూడా గెలవకూడదు. అయితే వీళ్ళకు ఎక్కడో సుడి కలిసి వచ్చి గెలిచారు.

 

2014లో ఏదో అదృష్టం కలిసివచ్చి చంద్రబాబు గెలిచారు. మోడి, పవన్ కల్యాన్ ను పక్కన పెట్టుకుని జగన్ పై విజయం సాధించిన చంద్రబాబు అదంతా తన బలుపే అనుకున్నారు. వాపును చూసి బలుపనుకుని పొరపాటు పడిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 46 ఏళ్ళ యువకుడిని తట్టుకోలేక చేతెలెత్తేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

వైసిపి ప్రభజనం మామూలుగా లేదు. నిజానికి ఇన్ని సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అయినా ఊహించారో లేదో. మొత్తం 175 సీట్లలో వైసిపి ఏకంగా 150 చోట్ల గెలిచిందంటే దాదాపు 85 శాతం షేర్ వచ్చినట్లే. బహుశా దేశచరిత్రలోనే మొత్తం సీట్లలో ఇంత షేర్ తెచ్చుకున్న పార్టీ లేదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: