ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాక పాల‌న‌పై కంటే విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునేందుకే ఎక్కువుగా దృష్టి పెట్టిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. పార్టీ బ‌లోపేతం కోసం విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌ను లాగేసుకుని వారికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చిన చంద్ర‌బాబు ఏపీ పాల‌న‌ను ప‌ట్టించుకోలేదు. అందుకే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోల‌వ‌రం, అమ‌రావ‌తి లాంటి ప్రాజెక్టులు కూడా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉండిపోయాయి.


ఈ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు శ్రీకారం చుట్టిన చంద్ర‌బాబు వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకున్నారు. మంత్రి ప‌ద‌వులు ఎర‌వేయ‌డంతో పాటు కాంట్రాక్టులు ఇవ్వ‌డం ద్వారా కొంద‌రిని.. డ‌బ్బులు, ఇత‌ర‌త్రా ప్ర‌లోభాల ద్వారా మ‌రికొంద‌రిని టీడీపీలోకి లాగేసుకున్నారు. ఇలా జంప్ చేసిన వారిలో అమ‌ర్నాథ్‌రెడ్డి, అఖిల‌ప్రియ‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వాళ్ల‌కు మంత్ర ప‌ద‌వులుల కూడా ఇచ్చారు. 


క‌ట్ చేస్తే ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వైసీపీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేల‌ను కొన్నారో... చివ‌ర‌కు ఫ‌లితాల త‌ర్వాత అంతే మంది ఎమ్మెల్యేలు మిగిలారు. టీడీపీ నుంచి ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే గెలిచారు. ఈ లాజ‌క్ అనుకోకుండా ఇలా జ‌రిగింది. ఇక ఈ ఫ‌లితాలు కూడా 23వ తేదీనే వెల్ల‌డ‌వ్వ‌డం మ‌రో విశేషం. ఇలా నాటి నుంచి నేటి వ‌ర‌కు జ‌గ‌న్‌కు ఈ 23వ తేదీ బాగా క‌లిసొచ్చిన‌ట్లు ఉంది. నాడు 23 మంది ఎమ్మెల్యేలు త‌మ పార్టీని వీడ‌డం జ‌గ‌న్‌కు షాక్ అయితే ఇప్పుడు అదే 23వ తేదీన చంద్ర‌బాబుకు కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే మిగ‌ల్చ‌డం బాబుకు ఇచ్చిన డ‌బుల్ షాక్?


మరింత సమాచారం తెలుసుకోండి: