ఏపీ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు హ‌డావుడికి త‌గిన‌ట్లుగా ప‌లువురు నేత‌లు ఆయ‌న తీరును ఎద్దేవా చేస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో, అనంత‌రం కూడా చంద్ర‌బాబు చేసిన‌ ఢిల్లీలో చ‌క్రం తిప్పేస్తా అనే ప్ర‌క‌ట‌న‌ల‌ను ఇచ్చారు. అయితే, సొంత రాష్ట్రంలోనే చ‌తికిల ప‌డిపోయారు. తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లోనే ఏనాడు లేని విధంగా ఘోర ప‌రాజ‌యం పాలైంది ఆ పార్టీ. అయితే, బాబు హ‌డావుడిపై బీజేపీ చీఫ్ అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.


బీజేపీ విజ‌యం అనంత‌రం ఢిల్లీలో అమిత్ షా మాట్లాడుతూ, ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు విపక్షాలను ఏకం చేయడానికి చాలా కృషి చేసారని, ఈ కష్టం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం చేసివుంటే ఇంత కష్టం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.చంద్రబాబువి తుక్ డే తుక్ డే రాజకీయాలని అన్నారు. ఆంధ్రాలో గెలిచిన జగన్ మోహాన్ రెడ్డీకి మనస్పూర్తిగా అభినంధనలు తెలుపుతున్నట్లు చెప్పారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత ఫలితాలను ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భారత విజయంగా అభివర్ణించారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా ఇది ప్రజలిచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. కులతత్వం, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని అమిత్‌షా పేర్కొన్నారు. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శమని తెలిపారు. ఈ తీర్పు ప్రతిపక్షాల అసత్యపు ప్రచారాలకు, ఆధార రహిత రాజకీయాలకు, వ్యక్తిగత నిందలకు వ్యతిరేకంగా భారత్ ఇచ్చిన తీర్పు. కులతత్వాన్ని, వారసత్వ రాజకీయాలను, బుజ్జగింపులను తిరస్కరిస్తూ.. జాతీయవాదాన్ని, అభివృద్ధిని ఎంచుకొని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని పేర్కొన్నారు.


ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ...లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో బీజేపీకి దక్కిన ఈ ఘన విజయం దేశ ప్రజలకు అంకితమని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం తర్వాత బీజేపీకి ప్రజలు భారీ విజయం అందించారని మోదీ అన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చాం. కష్టాలకు వెనకడుగు వేయని పార్టీ శ్రేణులను చూసి గర్విస్తున్నానన్నారు. ``మండుటెండల్లో కూడా తరలివచ్చి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. నన్ను మరోసారి ఆశీర్వదించి, అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారత్ ఒక ప్రజాస్వామ్య శక్తి అని ప్రపంచదేశాలు గుర్తించాలి. పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకున్న ఈసీ, భద్రతా బలగాలు, ప్రజలకు అభినందనలు. 130 కోట్ల మంది ప్రజలు దేశం పక్షాన నిలిచారు. దేశం బాగు కోసమే వెల్లువలా తరలివచ్చి బీజేపీ ఓటేశారు. ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల జరిగినా..ఇంతటి ఘనవిజయం దక్కలేదు`అని మోదీ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: