వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల్లో ఏపీలో తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థులు ఏకంగా 151 చోట్ల విజ‌యం సాధించారు. ఇక ఏపీలో 25 ఎంపీ సీట్ల‌కు గాను ఆ పార్టీ అభ్య‌ర్థులు ఏకంగా 23 చోట్ల విజ‌యం సాధించారు. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని కనీసం కేసీఆర్ కూడా ఊహించి ఉండ‌రు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ వైర‌ల్ అవుతోంది. ఆయ‌న అదృష్ట సంఖ్య 3 అంటూ  ఆ మెసేజ్ బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.


ఇంత‌కు ఆ మెసేజ్‌లో ఏం ఉందంటే..పులివెందుల‌లో జ‌గ‌న్‌కు 90,543 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఈ సంఖ్య చివ‌ర్లో 3 అంకె ఉంది. ఇక ఆ మొత్తం మెజార్టీ కూడినా 3 సంఖ్యే వ‌స్తోంది. ఇక డిసెంబ‌ర్ 21 జ‌గ‌న్ పుట్టిన రోజు. ఈ అంకె కూడినా 3 వ‌స్తుంది. ఇక మార్చి 12న జ‌గ‌న్ వైసీపీని స్థాపించారు. ఈ నెంబ‌ర్ క‌లిపినా కూడా 3 అవుతుంది. ఇక జ‌గ‌న్ పార్టీ స్థాపించిన నెల కూడా మార్చి 3వ నెల‌.


ఇక పార్టీ జెండాలో మూడు రంగులు ఉన్నాయి. వైసీపీ గుర్తు కూడా ఫ్యాన్‌. ఫ్యాన్ రెక్క‌లు మూడు ఉంటాయి. ఇలా ఎలా చూసుకున్నా జ‌గ‌న్‌కు 3 అంకెకు లింక్ ఉంది. దీంతో 3 అంకె జ‌గ‌న్‌కు అదృష్ట సంఖ్య అంటూ ఆ మెసేజ్ బాగా వైర‌ల్ అవుతోంది. ఇక జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీ రావ‌డ‌తో ఆంధ్ర‌ప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: