మోడీ సృష్టించిన ఓట్ల సునామీకి తృణమూల్ కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్ కూడా తలవంచక తప్పలేదు. మోదీ-అమిత్‌ షా ప్లాన్ ఇక్కడ బాగా వర్కవుట్ అయ్యింది. బీజేపీ ఊహించని స్థాయిలో ఇక్కడ బలం పుంజుకుంది. గతంలో రెండు స్థానాలు ఉన్న చోట ఇప్పడు  ఏకంగా 18 స్థానాలకు చేరుకుంది. 


మొత్తం 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌.... అత్యధికంగా 22 చోట్ల విజయం సాధించినప్పటికీ, 2014లో గెల్చిన 34 స్థానాలతో పోలిస్తే 12 సీట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే గెల్చిన బీజేపీ ఈసారి ఏకంగా 18 సీట్లు కైవసం చేసుకుంది. 

ఈ ఎన్నికలతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తృణమూల్‌ కు ప్రత్యామ్నాయంగా అవతరించింది. బీజేపీ మందుగా అనుకున్న మిషన్‌-23 సాకారం కాకపోయినా.. గతంలో పోలిస్తే బాగా లాభపడింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే..  2014 ఎన్నికల్లో రెండుచోట్ల గెల్చిన కాంగ్రెస్‌ ఇప్పుడూ అదే స్కోరు. 

గతంలో దశాబ్దాల తరబడి బెంగాల్‌ ను ఏలిన వామపక్షాలు కనీసం ఖాతా తెరవలేకపోయాయి. మమత ప్రభుత్వంపై వ్యతిరేకత, ఏకపక్ష నిర్ణయాలు మమత కొంప కొల్లేరు చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ఆమె ఫెయిల్ అయ్యారు. ఎన్నికల్లో చేసిన ఓవర్ యాక్షన్ కీడు చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: