సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్‌ లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఇటీవలే ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.. ఏకంగా రాష్ట్ట్రం మొత్తం మోడీకే జై కొట్టేసింది. 


అధికార కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి మ్యాజిక్ రిపీట్ చేయడంలో కాంగ్రెస్ ఫెయిలైంది. కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలు  బీజేపీకి కలసివచ్చాయి. జాతీయ వాదం ఓట్ల వర్షం కురిపించింది. సరిహద్దు రాష్ట్రం కావడంతో భావోగ్వేగాలు కూడా ఎక్కువే. 

మోడీ గాలిలో ఇక్కడి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేశారు. భారీ మెజారిటీలు సాధించారు. భిల్వారా లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్ర బహేరియా 6,12,000 ఓట్ల ఆధిక్యత సాధించారు. మోదీ గాలిలో పలువురు బీజేపీ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో మెజారిటీ పెరిగింది. 

అజ్మేర్ నుంచి బీజేపీ అభ్యర్థి భగీరథ చౌదరి, ఝాల్వార్ బారన్ అభ్యర్థి దుష్యంత్ సింగ్, ఉదయ్ పూర్ నుంచి అర్జున్ రాంమీనా తమ సమీప ప్రత్యర్థుల కంటే నాలుగులక్షల ఓట్ల మెజారిటీ సాధించి రికార్డులు సృష్టించారు.  బర్మేర్ నుంచి కైలాష్ చౌదరి, భరత్ పూర్ నుంచి రంజిత కోలి, ఛూరు నుంచి రాహుల్ కస్వాన్, అల్వార్ నుంచి బాబా బాలనాథ్, జుంజును నుంచి నరేంద్రఖించార్ దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: