లోకేష్ మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. దీనితో ఈ ఓటమిని ఇంకా జీర్ణించుకొనే పరిస్థితిలో లోకేష్ కనిపించడం లేదు. అయితే మంగళగిరి నుంచి ప్రత్యక్ష పోటీకి రెడీ అయినప్పటికీ నారాలోకేష్ మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగారు. ఆ విషయంలోనే విమర్శలు వచ్చాయి. నారా లోకేష్ కు ఓటమి భయం ఉంది, అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు.. అనే విశ్లేషణలు గట్టిగా వినిపించాయి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం అవేవీ తమకు వినపడనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు!


చివరకు అదే నిజం అయ్యింది. మంగళగిరిలో నారాలోకేష్ చిత్తుగా ఓడారు. ఇప్పుడు ఇంతకీ లోకేష్ పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం అయిన ఆయన.. ఎమ్మెల్యేగా నెగ్గలేని నేపథ్యంలో, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోవడం మేలైందని కొంతమంది అంటున్నారు. ఇందులో వ్యంగ్యమే ఎక్కువగా ఉంది. లోకేష్ మాటలు, చేష్టలు ఇప్పటి వరకూ ప్రహసనంగా నిలుస్తూ వచ్చాయి.


అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యేగా ఓడిన ఆయన ఎమ్మెల్సీ పదవితో మిగిలి వ్యంగ్యం పాలయ్యారు. తనను ప్రజలు ఎమ్మెల్యేగా ఓడించిన నేపథ్యంలో లోకేష్ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలి. లోకేష్ కు ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హతలేదు అని ప్రజలు తేల్చారు. అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగడం ఎంతవరకూ సబబో ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే లోకేష్ పౌరుషం ఉన్న వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాకాదు.. అంటే, లోకేష్ 'ఎమ్మెల్సీ'గా అనే హోదాతోనే మిగిలిపోతారు!

మరింత సమాచారం తెలుసుకోండి: