గోవాలో ఉన్న రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో సగం బిజెపి గెలుచుకుంది. అంటే రెండు స్ధానాల్లో ఒకటి గెలుకుందన్న మాట. రాష్ట్రంలో అధికారం బిజెపి చేతిలోనే ఉన్నప్పటికీ కేవలం ఒకటే గెలుచుకోవటం ఆశ్చర్యంగా ఉంది.

 

నార్త్ గోవా నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి శ్రీపాద్ యశోనాయక్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి గిరీష్ రాయ్ చోఢంకర్ పై భారీ మెజారిటీతోనే గెలిచారు. దక్షిణ గోవాలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి కోస్మే ఫ్రాన్సిస్ కైటాన్ సర్దిన్హా సమీప బిజెపి అభ్యర్ధి నరేంద్ర సావల్కర్ పై గెలిచారు. మెజారిటీ తక్కువే అయినా గెలుపు గెలుపే కదా.

 

పోయిన ఎన్నికల్లో రెండు స్ధానాలను బిజెపి గెలుచుకున్నా ఈసారి మాత్రం ఒకటితో సరిపెట్టుకోవాల్సొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఉన్నపుడు బిజెపికి గట్టి నాయకత్వం ఉండేది. ఆయన మరణంతో నాయకత్వం బాగా వీకైంది. కాకపోతే కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండటంతొ ఒకదానిలో అయినా గెలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: