దేశ ఆర్ధిక రాజధానిగా పాపులరైన ముంబాయ్ ఉండే మహారాష్ట్రలో బిజెపి తన పట్టును నిరూపించుకున్నది. రాష్ట్రంలోని 48 సీట్లలో బిజెపి-శివశేన కూటమి ఏకంగా 41 స్ధానాల్లో గెలుచుకుంది. ఇందులో బిజెపి వాటా 23 స్దానాలుండటం గమనార్హం. కాంగ్రెస్ కూటమి 7 స్ధానాలతో సరిపెట్టుకోవాల్సొచ్చింది లేండి.

 

పోయిన ఎన్నికల్లో బిజెపి, శివశేన రెండూ కలిసే పోటీ చేసినా తర్వాత తలెత్తిన గొడవల వల్ల విడిపోయాయి. నాలుగేళ్ళ పాటు రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. అయినా చివరకు ఎన్నికల ముందు మళ్ళీ ఏకమై పొత్తులు పెట్టుకున్నాయి.

 

నిజానికి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం తీవ్ర స్ధాయిలో ఉంది. సీట్ల సర్దుబాటులో రెండు పార్టీలు జాగ్రత్త పడ్డాయి. ఎక్కడా గొడవలు పడకుండా సర్దుకున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్-ఎన్సీపీలు మాత్రం విపరీతంగా గొడవలు పడ్డాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పోటీ చేయకపోకయినా ఆయన మీదున్న వ్యతిరేకత ఆయన మనవలు, పార్టీ అభ్యర్ధులపై ప్రభావం చూపాయి.

 

రాష్ట్రంలో గుజరాతీ, మరాఠీ మధ్య తరగతి జనాలుండే ప్రాంతాలన్నీ బిజెపి కూటమికి గట్టి మద్దతుగా నిలబడ్డాయి. అదే సమయంలో కాంగ్రెస్ కూటమికి ముస్లింల మద్దతు కూడా అనుకున్నంతగా లభించలేదు. కాంగ్రెస్ తరపున ఊర్మిళా మటోండ్కర్ పోటీ చేసినా ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: