నవీన్ పట్నాయక్ పట్టు ఒడిస్సాలో ఏ స్ధాయిలో ఉందో తాజా ఎన్నికలే రుజువు చేస్తున్నాయి. గడచిన 20 ఏళ్ళుగా రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏలుతున్న నవీన్ కే మరో ఐదేళ్ళు జనాలు పట్టం కట్టారు. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరిగాయి. 147 అసెంబ్లీ స్ధానాల్లో బీజూ జనతాదళ్ కు జనాలు 105 పగ్గాలప్పగించారు.

 

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సుంది లేండి. కానీ అదే సమయంలో 21 పార్లమెంటు స్ధానాల్లో మాత్రం బిజెడి 13 స్ధానాల్లో తన పట్టు నిలుపుకుంది. ఎలాగైనా నవీన్ ను దెబ్బకొట్టి మెజారిటీ పార్లమెంటు స్ధానాలను గెలుకుకోవాలని అనుకున్నా బిజెపికి సాధ్యం కాలేదు. అందుకనే 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. కాకపోతే పోయిన ఎన్నికల్లో వచ్చింది కేవలం ఒక్క స్ధానం మాత్రమే. ఈసారి మరో ఏడు సీట్లు తోడయ్యాయి.

 

ఒడిస్సాలో ఆధిక్యం కోసం మోడి, అమిత్ షా ధ్వయం చాలానే కష్టపడింది. అయినా జనాలు మాత్రం నవీన్ వైపే మొగ్గు చూపారు. పై ఇద్దరు కూడా ఒడస్సాపై ప్రత్యేక దృష్టి పెట్టినా ఉపయోగం లేకపోయింది. తుపానులు వచ్చినపుడు ఇతరత్రా సమయాల్లో కూడా కేంద్రం నుండి రాష్ట్రానికి ఉదారంగా సాయం చేశారు. అంటే రాజకీయంగా లబ్ది పొందేందుకే లేండి. కానీ జనాలు మాత్రం ఎందుకనో నవీన్ కే పట్టం కట్టటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: