ఏపిలో మొన్నటి వరకు ఎంతో ఉత్కంఠ రేపి ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి.  మొదటి నుంచి ఏపిలో అన్ని సర్వేలు జగన్ వైపే మొగ్గు చూపాయి..కాకపోతే 100 వరకు దాటే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వేలు తెలిపాయి.  కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా 150 సీట్లతో జగన్ ప్రభంజనం సృష్టించారు.  మరో వారంలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్, అతి పిన్న వయసులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయనున్న మూడో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. 


ఇప్పుడు జగన్ వయసు 46 సంవత్సరాల 6 నెలలు..గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో 38 సంవత్సరాల 11 నెలల వయసులో దామోదరం సంజీవయ్య సీఎంగా పనిచేశారు. తరువాత 45 సంవత్సరాలా 5 నెలల వయసులో చంద్రబాబునాయుడు సీఎం అయ్యారు. వీరి తర్వాత పిన్న వయసులో సీఎం అవుతున్న జగన్..అందుకే ఆయన మరో రికార్డు సృష్టించారని అంటున్నారు వైసీపీ శ్రేణులు.  


ఇక దేశ వ్యాప్తంగా పిన్న వయసులో సీఎం అయిన వ్యక్తుల్లో  అసోంకు 1985లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రఫుల్ల కుమార్‌ మహంత వయసు 33 ఏళ్లు మాత్రమే. ఆ తరువాత  39 ఏళ్ల వయసులో 2012లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అఖిలేష్ యాదవ్.


మరింత సమాచారం తెలుసుకోండి: