ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ శాతాలను పరిశీలిస్తే వైసీపీ కళ్ళు చెదిరే ఓటింగ్ షేర్ ని సొంతం చేసుకుందని అర్ధమవుతోంది. ఆ పార్టీ గ్రాండ్ విక్టరీ నమోదు చేయడమే కాదు,  సీట్లతో పాటు ఓట్లు కూడా అంతే స్థాయిలో రాబట్టిందని తెలుస్తోంది. ఇక తాజా ఎన్నికల్లొ  తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి మధ్య పది శాతం ఓట్ల తేడా ఉంది.


ఈసీ వివ‌రాల ప్రకారం  అసెంబ్లీకి పడిన తీరు చూసుకుంటే  49.95 ఓట్ల షేర్ ని వైసీపీ రాబట్టింది. అంటే ఆ పార్టీకి 1,56,83,592 ఓట్లు పోల్ అయ్యాయి. 151 అసెంబ్లీ సీట్లు లభించాయి. ఇక తెలుగుదేశం పార్టీకి 39.18 శాతం ఓటింగ్ పడింది.  అంటే (1,23,01,741 మంది ఆ పార్టీకి ఓట్లు వేశారు. ఈ విధంగా చూసినపుడు టీడీపీకి, వైసీపీకి మధ్య పది శాతం ఓట్ల తేడా స్పష్టంగా కనిపిస్తోంది.


ఇదే విధంగా లోక్ సభకు ఓటింగ్ కూడా పడింది. వైసీపీకి లోక్ సభ ఓటింగ్ శాతం 49.15 గా ఉంది. 1,55,25,602 మంది ఓటర్లు ఆ పార్టీకి ఓట్ చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే 39.59 ఓట్ల శాతం, 1,25,07,277 మంది ఓటింగ్ చేశారు. ఇక్కడ కూడా పది శాతం ఓట్ల తేడా రెండు పార్టీల మధ్య ఉంది.


2014 ఎన్నికలలో చూసుకుంటే వైసీపీకి, టీడీపీ, బీజేపీ కూటమికి మధ్య 2.21 శాతం తేడా ఉంది.  అప్పట్లో టీడీపీ కూటమికి 46.79  శాతం ఓట్లు వస్తే, వైసీపీకి  44.58 శాతం ఓట్లు వచ్చాయి. ఇపుడు వైసీపీ ఏకంగా మరో ఆరు శాతం ఓట్లు తెచ్చుకుంటే టీడీపీ మాత్రం ఏడుశాతం తక్కువకు పడిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: