వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఘన విజయం సాధించి రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఆయన సృష్టించిన రికార్డులు ఏవో లెక్కలు వేసే పనిలో మీడియా ఉంది. అంతటి అద్భుత విజయం జగన్ సాధించారు. 


ఈ విజయాలన్నింటికీ పునాది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే. వైఎస్‌ లేకపోతే జగన్‌ అనే వ్యక్తికి రాజకీయ భవితవ్యమే లేదు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయమే కాదు. ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు జగన్.  

సాహసాలను వెనకాడకపోవడం.. నమ్మిన విషయం కోసం తలవంచకపోవడం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం.. మొండిగా పోరాటం చేయడం.. ఇవీ వైఎస్ లక్షణాలు.. ఇప్పుడు జగన్‌ను నిలబెడుతున్నవీ అవే.  

ఆ తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న జగన్.. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. ఒంటరిగా పోటీ చేయాలన్నది జగన్ అభిప్రాయం.. గెలుస్తామా లేదా.. అన్న లెక్కలు వేసుకోలేదు. ఆ అభిప్రాయం నుంచి పక్కకు జరగలేదు.

2014లోనూ.. 2019లోనూ ఆయన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. వైఎస్‌ తరహాలోనే మొండితనంతో కొన్ని దెబ్బలూ తిన్నాడు జగన్. 2014లో రైతు రుణమాఫీ ఇస్తే గెలుస్తామని పార్టీ నేతలు చెప్పినా తన తీరు మార్చుకోలేదు. ఓటమి నుంచి వైఎస్ లాగానే ఇప్పుడు జగన్ కూడా గుణపాఠాలు నేర్చుకున్నారు. దాని ఫలితమే ఈ అఖండ విజయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: