ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు ఒక్కొక్కటిగా హంగులన్నీ అమరుతున్నాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండే లాంఛనాలన్నీ సమకూరుస్తున్నారు అధికారులు. ఇప్పటికే అమరావతిలోని జగన్ నివాసం వద్ద  భద్రత పెంచేశారు. 


తాజాగా కొత్త ముఖ్యమంత్రి కోసం సరికొత్త కాన్వాయ్‌ కూడా సిద్ధం చేసేశారు.  AP 18P 3418 నంబర్‌తో కూడా కొత్త వాహన శ్రేణి ఆయన ఇంటి వద్దకు చేరుకుంది. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉండే వాహనాలన్నింటికీ ఒకే నెంబర్ ఉంటుంది. 

ముఖ్యమంత్రి ఏ వాహనంలో వెళ్తున్నాడనేది తెలియకుండా పోలీస‌ శాఖ ఆ ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి భద్రత ఏర్పాట్లలో ఇది తప్పనిసరి. మొత్తం 6 వాహనాలతో జగన్ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కాన్వాయ్‌ లో అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయి. వాహనాలన్నీ  బుల్లెట్‌ ప్రూఫ్‌ తో కూడినవే.  ఈ నెల 30 జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. జగన్ పర్సనల్ సెక్యూరిటీని కూడా పోలీసు శాఖ పెంచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: