ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌య‌స్సు పైబ‌డుతోన్న కొద్ది చేస్తోన్న రాకీయాలు సొంత పార్టీ నేత‌ల‌కే విస్మ‌యం క‌ల‌గ‌చేస్తున్నాయి. ఆయ‌న తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌తో పార్టీ సీనియ‌ర్ నేత‌లే విసిగిపోతున్నారు. త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం సొంత కుటుంబ స‌భ్యుల‌ను కూడా బ‌లి చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువైపోతున్నాయి. ఇక ఈ ఎన్నిక‌ల్లో ఘోరఓట‌మి త‌ర్వాత ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు చంద్ర‌బాబు నుంచి పార్టీని లాక్కొని టీడీపీని కాపాడుకోవాల‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. 1995లో చంద్ర‌బాబు ఎన్టీఆర్ నుంచి ఎలా పార్టీని లాక్కున్నారో ? ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా పార్టీని చంద్ర‌బాబు నుంచి స్వాధీనం చేసుకుని కాపాడుకోవాల‌న్న టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది.


ఇక గ‌తేడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న మెహ‌ర్బానీ కోసం అప్ప‌ట‌కి కొద్ది రోజుల ముందే చ‌నిపోయిన ఆయ‌న బావ‌మ‌రిది నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె నంద‌మూరి సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నిక‌ల్లో సుహాసిని చిత్తుగా ఓడిపోయారు. ఫ‌లితంగా నంద‌మూరి కుటుంబం ప‌రువు గంగ‌లో క‌లిసింది. ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌బాబుకు ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వ‌దిలేయ‌డం అల‌వాటే. అందుకే 2009 ఎన్నిక‌ల త‌ర్వాత ఎన్టీఆర్‌ను దూరం పెట్టారు.


ఇక గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక త‌న త‌న‌యుడికి దొడ్డిదారిన ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి.. మంత్రిని చేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. లోకేష్ మంత్రిగా ప‌నిచేసినా ఏ మాత్రం అనుభ‌వం రాలేదు. ఆయ‌న‌కు మాట్లాడ‌డ‌మే స‌రిగా రాలేద‌న్న అభిప్రాయం కూడా ఉంది. ఇక లోకేష్ పోటీ చేసేందుకు ఏకంగా ఏడెనిమిది నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప‌రిశీలించి చివ‌ర‌కు మంగ‌ళ‌గిరిని ఎంపిక చేశారు. అయినా ఓడిపోయాడు. 


ఇక లోకేష్ తోడ‌ళ్లుడు భ‌ర‌త్ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. చాలామంది బాబును, జ‌గ‌న్‌ను స‌రిపోలుస్తూ జ‌గ‌న్ ఇలాంటి రాజ‌కీయాలు ఎప్పుడూ చేయ‌లేద‌ని అంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ వీరాభిమాని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఇదే అంశంపై చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. త‌న త‌న‌యుడి కోసం దొడ్డిదారిన మంత్రి ప‌ద‌వి ఇచ్చిన బాబు, అటు హ‌రికృష్ణ కుమార్తెతో పాటు ఇటు భ‌ర‌త్‌ను బ‌లి ప‌శువును చేశార‌ని.. ఇక గుడివాడ‌లో దేవినేని అవినాష్‌ను ఓడించార‌ని కూడా నాని ఫైర్ అయ్యారు. ఏదేమైనా ఇక చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై సొంత పార్టీలోనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: