జనసేన పార్టీ టీడీపీని ఘోరంగా దెబ్బతీసిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. దాదాపు 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో జనసేన దెబ్బ గట్టిగా తగలడం వల్లే ఓడిపోయామని టీడీపీ అధినేత చంద్రబాబుకి, పార్టీ ముఖ్యనేతలు సమాచారమిచ్చారట. ఓ 30 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ విజయావకాశాల్ని దెబ్బకొట్టిందన్నది తెలుగు తమ్ముళ్ళ విశ్లేషణ. అయితే, ఒక్క లోక్‌సభ నియోజకవర్గంలోనూ కనీసం రెండో స్థానానికి కూడా ఎగబాకలేకపోయింది జనసేన. ఒకట్రెండు చోట్ల మినహాయిస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. 


జనసేన సంగతి పక్కన పెడితే, తమ ఓటమికి ఓ కుంటి సాకు దొరికిందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారిప్పుడు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు, చిరంజీవి కారణంగానే తాము ఓడిపోయామంటూ బుకాయింపులు షురూ చేసిన విషయం విదితమే. మెజార్టీల లెక్కలు కట్టి, వాటిని జనసేనకి వచ్చిన ఓట్లతో పోల్చి.. టీడీపీ నేతలు కిందామీదా పడ్తున్నారు.. ఓటమికి గల కారణాల్ని వెతుక్కుంటూ.


ఒకవేళ జనసేన అనే పార్టీ లేకపోయి వుంటే, మొత్తంగా 175 స్థానాల్లో 165 నుంచి 170 స్థానాల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయబావుటా ఎగురవేసి వుండేదేమో.! లోక్‌సభ నియోజకవర్గాలన్నిటిలోనూ టీడీపీకి గుండు గీసేసి వుండేదేమో.! ఇదీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాదన. అవును మరి, 150 మార్క్‌ని అందుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు. ఇది నిఖార్సయిన ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ అంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: