ఉమ్మడి ఏపీకి, ఏపీకి ఎందరో ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరికి వారు తమదైన ముద్ర వేశారు. వారి అనుభవాలను ఏపీ ప్రజలకు అందించారు. ఇప్పటికీ వివిధ వర్గాల నుంచి ఎందరో సీఎం లు ఏపీని పాలించడానికి వచ్చారు.  ఆయా సందర్భాలకు అనుగుణంగా వారు నిరూపించుకున్నారు కూడా.


మరి జగన్ ప్రత్యేకత ఏంటి అంటే ఏపీని పాలించిన వారిలో మూడవ అతి పిన్న వయస్కుడు జగన్. ఇది రికార్డుల్లో ఉంది. ఉమ్మడి ఏపీలో  60వ దశాబ్దంలో దామోదరం సంజీవయ్య కొన్నాళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. అప్పటికి ఆయన వయసు 38 ఏళ్ళ పదకొండునెలలు. ఆయన తొలి చిన్న వయసు సీఎం. 


ఆ తరువాత 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రెండవ అతి చిన్న వయస్కుడు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి 45 ఏళ్ళ 5 నెలల ఏజ్ లో ఉన్నారు. ఇక ఇపుడు ఏపీకి సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్న జగన్ మూడవ పిన్న వయస్కుడు. 


ఆయన వయసు ఇపుడు 46 ఏళ్ళ ఆరు నెలలు. సీఎం కావడానికి జగన్ పదేళ్ళు వైట్ చేస్తే ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి 30 ఏళ్ళ కాలం వేచి చూశారు. సీఎం నాటికి వైఎస్సార్ వయసు 55 ఏళ్ళు. జగన్ తండ్రి కంటే తొమ్మిదేళ్ళ ముందే ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తున్నారు.  ఇది కూడా ప్రత్యేకతగా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: