వైకాపా ఎప్పుడూ లేని విజయాన్ని సొంతం చేసుకుంది.  ఒకటికాదు రెండు కాదు ఏకంగా 152 స్థానాల్లో విజయ బావుటా ఎగరవేసింది.  గత 30 ఏళ్లలో టిడిపికి ఇది ఘోర పరాజయం.  ఈ స్థాయిలో ఎప్పుడు ఓడిపోలేదు.  ఎల్లో మీడియాను పక్కన ఉంచుకొని, ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువయ్యే పధకాలను, ప్రచారాన్ని సిద్ధం చేసుకొని ప్రజా రణరంగంలోకి అడుగుపెట్టిన చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలేలా చేసింది వైకాపా.  వైకాపా విజయం వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.  అందులో ఒకరు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాగా, రెండో వ్యక్తి దివ్యా రెడ్డి.  


సోషల్ మీడియా హెడ్.  గత ఆరు నెలలుగా సోషల్ మీడియా  టీమ్ ను ముందుండి నడిపించిన మహిళ.  ఎప్పటికప్పుడు ప్రజలకు కనెక్ట్ అయ్యే కంటెంట్ ను సృష్టించి... దానిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.  తన టీమ్ తో ప్రతిరోజూ మీటింగ్ లు నిర్వహిస్తూ ఎలా రీచ్ కావాలో తగిన సూచనలు ఇస్తుండేది.  రాష్ట్రంలో ఉన్న ప్రతి సోషల్ మీడియా పర్సన్ తో టచ్ లో ఉంటూ టార్గెట్ ను సెట్ చేస్తుండేది.  


అంతేకాదు ఎల్లో మీడియా సృష్టించే అసత్య ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేలా కంటెంట్ ను సృష్టించి ప్రజలకు చేరువయ్యేలా చేశారు.  రాత్రి పగలు నిత్యం వైకాపా విజయం కోసమే కృషి సోషల్ మీడియా కష్టపడింది.  ఈ కష్టానికి ప్రతిఫలం ఎన్నికల్లో గెలుపొందిన 152 సీట్లు.  ఈ స్థాయిలో విజయం సాధించింది అంటే దాని వెనుక సోషల్ మీడియా కృషి ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: