వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కేసీయార్ భేటీ. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎపుడో రెండేళ్ళ క్రితం రాజ్ భవన్లో రపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ సమక్షంలో కేసీయార్ జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ ఒక్కటే ఇద్దరూ అధికారికంగా కలసింది. అటువంటిది ఇపుడు మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవుతుందా.


అవును.. ఈ రోజు హైదరాబాద్ జగన్ వెళ్తున్నారు. ఈ నెల 22న వైసీపీ చీఫ్ హోదాలో తాడేపల్లి వచ్చిన జగన్ ఇపుడు కాబోయే సీఎం హోదాలో హైదరాబాద్ వెళ్తున్నారు. ఆయన కేసీయార్ని ఆయన నివాసంలో కలుస్తారని తెలుస్తోంది. కేసీయార్ ని సాదరంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్ ఆహ్వానిస్తారని తెలుస్తోంది.


అదే విధంగా ఇద్దరు నేతలూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల గురించి చర్చిస్తారు. అలాగే దేశంలో ఇపుడున్న రాజకీయ పరిస్థితులను కూడా అంచనా వేస్తారు. ఇక జగన్ రేపు ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ఆయన ప్రధాని మోడీని కలసి గ్రాండ్ విక్టరీ సాధించిన మోడీని గ్రీట్ చేస్తారని తెలుస్తోంది.  తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు, పలువురు జాతీయ నాయకులను కూడా జగన్ ఇన్వైట్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీయర్ జగన్ భేటీ చాలా ఇంటెరెస్టింగ్ న్యూస్ ఇపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: