Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:12 pm IST

Menu &Sections

Search

తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు

తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు
తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణలో కొందరు ఐపీఎస్‌ల చూపు ఇప్పుడు ఏపీ వైపు పడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు ఇంటర్‌స్టేట్‌ డిప్యుటేషన్‌పై వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, ఐపీఎస్‌ అధికారుల పోస్టింగ్‌ల విషయంలో దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన ఐపీఎస్‌లలో పలువురు రిటైర్‌ అయ్యారు. అప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు ఇప్పుడు జగన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు.  


ఇప్పటికే జగన్‌ని కలిసిన ఓ ఐపీఎస్‌ 

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. కానీ, వీరికి ఇంకా స్థానచలనం లభించలేదు. పదోన్నతులు పొందినా వారు పాతస్థానంలోనే అంటే తమ హోదా కంటే తక్కువ పదవిలో పనిచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక.. అంటే మే 28 తరువాత స్థానచలనం/ బాధ్యతల మార్పుపై హోంశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఈలోగా ఆరుగురు తెలంగాణ ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. వీరిలో ఒక అధికారి ఇప్పటికే విజయవాడ వెళ్లి జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను ఏపీలో పనిచేయాలనుకుంటున్నానని తన మనసులో మాట బయటపెట్టుకున్నారు. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం అనంతరం వీరి విజ్ఞప్తులపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. 


ఇద్దరు కేంద్ర సర్వీసులకు! 

తెలంగాణ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. వీరిలో సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌గా ఉన్న డీఐజీ అకున్‌ సబర్వాల్, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ) డైరెక్టర్‌గా ఉన్న సంతోశ్‌ మెహ్రాలు ఉన్నారని సమాచారం. ఎలక్షన్‌ కోడ్‌ తరువాత వీరి బదిలీకి రాష్ట్ర హోంశాఖ కూడా సుముఖంగా ఉందని, త్వరలోనే పచ్చజెండా ఊపనున్నందని తెలిసింది
ias-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ... ఇండియా భవనంలో మకాం
మరోసారి భేటీ అవనున్న ఇరు రాష్ర్టాల సీఎంలు
ఒంగోలు అత్యాచార ఘటనపై జగన్ ఆరా..
ముంబాయిలో ఎంజాయ్ చేస్తున్న శృతి, రానా, మరోకరు
సెక్సీ టీ షర్ట్ తో శాన్వి
చంద్రబాబు నివాసం హైదరాబాద్ లేక అమరావతా...?
సైరాలో తన పాత్ర ఏమిటో చెప్పేసిన తమన్న
ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తున్న సాహో బృంధం
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
స్మోకింగ్ ఇష్యూపై తనదైన శైలిలో స్పందించిన హిరో రామ్
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరిన సీఎం జగన్
 ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది...
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీరియసైన సీఎం జగన్
పోలీసు శాఖలో భారీగా నియమకాలు: సుచరిత
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.