రాష్ట్రంలో తాను ముణగటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని పార్టీల విజయవాకాశాలను కూడా చంద్రబాబునాయుడు దెబ్బ కొట్టారా ?  అలాగని స్వయంగా టిడిపి నేతలే చెప్పుకుంటున్నారు.  ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో వెల్లడైన ఫలితాలతో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.

 

రాష్ట్రంలో పోలింగ్ అయిపోగానే వెంటనే చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై దృష్టి పెట్టారు. నరేంద్రమోడి కి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో పార్టీలను ఏకం చేస్తానంటూ చంద్రబాబు చేసిన హడావుడి అందరూ చూసిందే. నిజానికి మోడికి వ్యతిరేకంగా ఒక్క పార్టీని కూడా చంద్రబాబు యూపిఏలోకి తీసుకు వచ్చింది లేదు. కేవలం తన జాతి మీడియాతో మాత్రం జాతీయ స్ధాయిలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్లు రాయించుకున్నారు.

 

మోడి వ్యతిరేక పార్టీలకు ప్రచారం పేరుతో చంద్రబాబు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ కు వెళ్ళి ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నట్లు బాగా హడావుడి చేశారు. సరే ప్రచారానికి వెళ్ళిన చంద్రబాబు ఆ రాష్ట్రాల్లో మాట్లాడింది మళ్ళీ తెలుగులోనే. మరి చంద్రబాబు ఏం మాట్లాడారో అక్కడి జనాలకు ఏమి అర్ధమైందో భగవుంతుడికే తెలియాలి.

 

సరే చివరిదశ  ఎన్నికలైపోగానే చంద్రబాబు తిరిగి అమరావతికి వచ్చేశారు. మొత్తానికి ఫలితాలు చూసిన తర్వాత టిడిపి చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా గమనిస్తే కర్నాటక, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ లో కూడా తృణమూల్ కాంగ్రెస్, బిఎస్పీ, ఎస్పీ, జనతాదళ్ పార్టీలు కూడా దెబ్బతిన్నాయి. కర్నాటకలో అయితే ఘోరంగా దెబ్బతిన్నది. బిఎస్పీ, ఎస్పీలు వేసుకున్న అంచనాల్లో సగం ఎంపి సీట్లు కూడా గెలవలేదు.

 

ఒక్క తమిళనాడులో మాత్రమే డిఎంకెకు అంచనాలకు మించి ఎంపి సీట్లు గెలిచింది. తమిళనాడుకు అంటే ఒక్కసారి మాత్రమే ప్రచారానికి వెళ్ళారు. కాబట్టే తమిళనాడుపై చంద్రబాబు ప్రభావం పెద్దగా లేదని టిడిపి నేతలే అంటున్నారు. అదే పశ్చిమబెంగాల్ లో అయితే మూడుసార్లు, కర్నాకటకు ఓ మూడుసార్లు, లక్నోకు మూడుసార్లు ప్రచారానికి వెళ్ళారు కాబట్టి ప్రభావం గట్టిగా పడిందని టిడిపి నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: