పై ఫోటోలోని దృశ్యాన్ని చూస్తున్నారా ? తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తికి పోలీసు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు. తెల్లదుస్తుల్లో ఉన్న వ్యక్తిని ఈపాటికే గుర్తు పట్టుంటారు లేండి. అవునే ఆయన అనంతపురం జిల్లా హిందుపురం పార్లమెంటు నియోజకవర్గంలో వైసిపి తరపున ఎంపిగా గెలిచిన అభ్యర్ధి గోరంట్ల మాధవ్.

 

మాధవ్ వైసిపి తరపున పోటీ చేస్తున్నాడనగానే టిడిపి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే అప్పుడేదో అయిపోయింది. మొత్తానికి మాధవ్ నామినేషన్ వేసి అభ్యర్ధిగా పోటీ చేశారు. దాదాపు 1.4 లక్షల మెజారిటీతో మాధవ్ గెలిచారు.

 

మాధవ్ గెలిచిన విషయం స్పష్టం అవ్వగానే కౌంటింగ్ సెంటర్ నుండి బయటకు వస్తున్నపుడు డిఎస్పీ ఎదురుపడ్డారు. మొన్నటి వరకూ మాధవ్ కూడా కదిరిలో సిఐగా పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. సిఐ అంటే డిఎస్పీ కన్నా తక్కువ స్ధాయి అధికారే. అప్పట్లో మాధవ్ రాజీనామా ఆమోదం పొందకుండా అడ్డుకున్న వాళ్ళల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నారట.

 

సరే ఏదేమైనా మొత్తానికి మాధవ్ గెలిచి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చారు. అక్కడే ఎదురుపడిని డిఎస్పీ వెంటనే హిందుపురం ఎంపి మాధవ్ కు సెల్యూట్ చేశారు. మాధవ్ తో పాటు అక్కడే ఉన్న మరికొందరు డిఎస్పీ సెల్యూట్ చేయటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకూ మాధవ్ తో సెల్యూట్ కొట్టించుకున్న  డిఎస్పీ ఇపుడు అదే మాధవ్ కు సెల్యూట్ కొట్టారు. డిఎస్పీనే కాదు ప్రజా ప్రతినిధి హోదాలో మాధవ్ వెళితే అడిషిపల్ ఎస్పీ అయినా ఎస్పీ అయినా సరే లేచి నిలబడి సెల్యూట్ చేయాల్సిందే. అదే  ప్రజాస్వామ్యంలోని గొప్పదనం.


మరింత సమాచారం తెలుసుకోండి: