Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 9:18 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : చంద్రబాబే జగన్ ను హీరోని చేశారా ?

ఎడిటోరియల్ : చంద్రబాబే జగన్ ను హీరోని చేశారా ?
ఎడిటోరియల్ : చంద్రబాబే జగన్ ను హీరోని చేశారా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసిపి సాధించిన అఖండ విజయంపై అనేక మంది అనేక రకాల విశ్లేషణలు ఇస్తున్నారు. సరే ఏ విశ్లేషణ ఎలాగున్నా ఒకటి మాత్రం నిజమని అందరికీ అర్ధమైపోయింది. అదేమిటంటే చంద్రబాబునాయుడు మీద జనాల్లో పెరిగిపోయిన కసి, అసంతృప్తి, టిడిపి ప్రజా ప్రతినిధులపై జనాల్లో పెరిగిపోయిన ఏహత్యభావమే జగన్ ఈరోజు హీరోగా నిలబెట్టాయి.

 

2014లో అధికారంలోకి వచ్చింది మొదలు చంద్రబాబు అనైతిక రాజీకాయాల్లోనే ముణిగిపోయారు. ఫిరాయింపులను ప్రోత్సహించటం, వైసిపి ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ అణిచివేయటం, వైసిపి నేతలను జైళ్ళల్లో పెట్టించటం లాంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడ్డారు. అసెంబ్లీలో జగన్మోణన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని అమ్మనాబూతులు తిట్టటాన్ని అందరూ చూసిందే. దాని ఫలితంగానే జగన్ అసెంబ్లీకి కాకుండా పాదయాత్ర అంటూ నేరుగా జనాల్లోకే వెళ్ళిపోయారు.

ఎప్పుడైతే జగన్ పాదయాత్ర మొదలుపెట్టారో జనాలు కూడా సానుకూలంగా స్పందించారు. పాదయాత్రలో జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారంటేననే చంద్రబాబుపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్ధమైపోతోంది. చంద్రబాబు ఏమాత్రం బ్యాలెన్సుడుగా ఉన్నా జగన్ పాదయాత్రంటూ జనాల్లోకి వెళ్ళేవారు కారేమో. అంటే జగన్  పాదయాత్ర చేసేట్లుగా చంద్రబాబు  పరిస్ధితులు కల్పించినట్లైంది. పాదయాత్రే వైసిపి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది.

 

జగన్, వైసిపి నేతలను రాచరంపాన పెట్టటం ఓ ఎత్తైతే మామూలు జనాలపైకి కూడా టిడిపి నేతల ధాష్టికాలు మితిమీరిపోయాయి. అధికారులపై దాడులు చేయటం, తామంటే గిట్టని మామూలు జనాలను కూడా ఇబ్బందులకు గురిచేయటం, అవినీతి, అరాచకాలు ఆకాశం అంత ఎత్తుగా పెరిగిపోయాయి. అంటే మంత్రులు, ఎంఎల్ఏల అవినీతి, అరాచకాలను చంద్రబాబు కూడా నియంత్రించలేని స్ధాయికి చేరుకున్నాయి.

 

పార్టీతో పాటు ప్రభుత్వం మీద కూడా చంద్రబాబు నియంత్రణ కోల్పోయారు. దాంతో అరాచకం పెరిగిపోయింది. ఆ అరాచకాన్నే జనాలు భరించలేకపోయారు. జనాల్లో పెరిగిపోయిన అసంతృప్తి, కసిని చంద్రబాబు కూడా గుర్తించలేకపోవటంతో ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు. విజయనగరం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో టిడిపికి ఒక్క సీటు కూడా లేదంటే వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

వైసిపి అభ్యర్ధుల్లో కనీసం 40 మందికి 35 వేల నుండి 60 వేల మధ్యలో మెజారిటీలు వచ్చాయంటే జనాలు ఏ స్ధాయిలో టిడిపి అభ్యర్ధులను అసహ్యించుకున్నారో అర్ధమైపోతోంది.  వెలువడిన ఫలితాలను బట్టి జనాల సానుకూలత జగన్ విషయంలో 40 శాతముంటే చంద్రబాబుపై కసి, ఏహ్యతా భావం 60 శాతం ఉన్నట్లు తెలిసిపోతోంది. అంటే జగన్ ను చంద్రబాబే హీరోను చేశారని అర్ధమైపోతోంది. ఎవరికైనా ఎనీ డౌట్ ?


naidu-made-jagan-hero
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు పరువు తీసేసిన అవంతి
ఎడిటోరియల్ : ఆఫీసు నుండి టిడిపిని గెంటేస్తున్న బిజెపి
ఎడిటోరియల్ : తప్పు దిద్దుకున్న చంద్రబాబు
ఎడిటోరియల్ : జగన్ ప్రభుత్వంపై టిడిపి సంచలన నిర్ణయం ?
ఆళ్ళతో చేయి కలిపిన లోకేష్
చంద్రబాబు దుమ్ము దులిపేసిన బుగ్గన
ఎడిటోరియల్ : పోలవరం ప్రాజెక్టు కోసం జగన్ మాస్టర్ ప్లాన్
ఎడిటోరియల్ : ఉలిక్కిపడుతున్న చంద్రబాబు..కారణం తెలుసా ?
ప్రకాశం జిల్లాలో ఎంఎల్సీ పదవి ఎవరికో తెలుసా ?
చంద్రబాబుకు అంబటి తీవ్ర హెచ్చరికలు
ఎడిటోరియల్ :  టిడిపిలో రాయలసీమ రెడ్ల భవిష్యత్తేంటి ?
ఎడిటోరియల్ :  కోడెల వినిపిస్తున్న కొత్త కథలు
జగన్ పై జేసి సంచలన వ్యాఖ్యలు..దేనికి సంకేతాలో ?
ఎడిటోరియల్ :  పాపం ఏబి..ఎంతటి గతి పట్టిందో  చూశారా ?
జగన్ కాన్వాయ్ లోకి కొత్త వాహనాలు..ఏంటో తెలుసా ?
ఎడిటోరియల్ :  టిడిపి, జనసేనపై ఫ్యాన్ ప్రభావం ఇంత ఉధృతంగా పడిందా ?
ఎడిటోరియల్ : ఫ్యాన్ గాలికి అల్లాడిపోతున్న ‘పెద్ద’ కుటుంబాలు
ఎడిటోరియల్ :  జగన్ నిజంగా గ్రేట్.. దశాబ్దాల సమస్య పరిష్కారం..వేలాదిమంది హ్యాపీ
ఎడిటోరియల్ : ఢిల్లీలో  అదరగొట్టేసిన జగన్
చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చేశారా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు కోసం జనాలు భోరుమంటున్నారా ?
తోకముడిచేసిన టిడిపి..బాధ్యతంతా వైసిపిదేనట
ఎడిటోరియల్ : చంద్రబాబుకు లోకేష్ భవిష్యత్ ముందే తెలుసా ?
ఎడిటోరియల్ : ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు చెక్కింగా ? అసలు కథేంటో తెలుసా ?
ఎడిటోరియల్ : స్పీకర్ గా కోడెల అనుభవం ఏ చెబుతోంది ?
ఎడిటోరియల్ : గంటా అడ్డంగా బుక్కైపోయినట్లేనా ?
సంచలనం : చంద్రబాబు-పికె మధ్య  ఒప్పందం ?
ఫిరాయింపులపై చంద్రబాబు నోరెత్తితే ఒట్టు
ఎడిటోరియల్ :  పాపం...ఓటమి దెబ్బ నుండి తేరుకున్నట్లు లేదు
ఎడిటోరియల్ :  వైసిపితో టచ్ లో ఉన్నది ఈ ఎంఎల్ఏలేనా ? సంచలనం
ఎడిటోరియల్ : చంద్రబాబులో టెన్షన్....ఎంఎల్ఏలపై నిఘా ?
టిడిపిలో మిగిలేది ఆ 5 మంది ఎంఎల్ఏలేనా ?
ఎడిటోరియల్ :   తొందరలో పవన్ కు షాక్ తప్పదా ?
ఎడిటోరియల్ : చంద్రబాబుకు కరెక్టు మొగుడు దొరికాడు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.