ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది ఇద్దరే ఇద్దరు. ఆనాడు అన్న ఎన్టీయార్. ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇద్దరు కూడా సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. రాష్ట్రాన్ని ఏలిన వారు చాలామందే ఉన్నా వారెవరూ సొంతంగా పార్టీని పెట్టి అధాకరంలోకి తెచ్చిన చరిత్ర లేదు. అందుకనే ఎన్టీయార్, జగన్ చరిత్రలో నిలిచిపోయారు.

 

1982లో కాంగ్రెస్ పార్టీ విధానాలకు విసిగిపోయిన ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీని పెట్టారు. కేవలం తొమ్మిది నెలల్లోనే ఎన్నికలను ఎదుర్కొని అధికారంలోకి రావటం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్ర. సినిమా రంగాన్ని దాదాపు 30 ఏళ్ళు ఏలిన ఎన్టీయార్ రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావటం తెలుగు రాష్ట్రంలో అదే రికార్డు. సరే తర్వాత మెగాస్టార్ చిరంజీవి, తాజాగా పవన్ కల్యాణ్ కూడా ప్రయత్నించి బోర్లా పడ్డారనుకోండి వేరే సంగతి.

 

ఇక వైసిపి  విషయం చూస్తే జగన్ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లో కొద్దిలోనే అధికారాన్ని జార్చుకున్నారు. ఐదేళ్ళు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాలు చేశారు. కేవలం పోరాటాల ద్వారానే జనాల్లో నమ్మకం పెంచుకున్నారు. దాని ఫలితంగానే 175 సీట్లున్న అసెంబ్లీలో 151 సీట్లను గెలుచుకోవటం. అంటే ఎన్టీయార్, జగన్ మాత్రం ప్రాంతీయ పార్టీలను పెట్టి అధికారంలోకి వచ్చిన విషయం స్పష్టమైపోతోంది. అందుకనే వాళ్ళిద్దరే రికార్డులను సృష్టించారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: