ఏపీలో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందా. అయిదేళ్ళ క్రితం విభజనకు ముందు నాటి యూపీయే సర్కార్ ఇచ్చిన హామీ కేంద్రంలోని బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా నెరవేర్చలేదు. మరో వైపు వైసీపీ సహా ఇతర పార్టీలు దీనిమీద ఉద్యమాలు ఎన్నో చేశాయి. అయినా ఈ అంశం అలాగే ఉంది. మళ్ళీ అక్కడా, ఇక్కడా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది .


ఇపుడు జగన్ సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో ఏం చేస్తుంది. ఆయన విధానం ఏంటి. ఇది అందరి మదిలో మెదిలే ప్రశ్న. దీనికి జగన్ ఈ రోజు జరిగిన ఆ పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశం వదిలేదు లేదు. ఈ విషయంలో  కేంద్రాన్ని ఒప్పించి అయిన తెచ్చుకుందాం,  లేకపోతే  తాడో పేడో తేల్చుకుందాం.. ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడాలి. 


అవసరమైతే రాజీనామాలు కూడా చేయాలి. ఇదే మన విధానంగా ఉండాలి. ఎంపీలకు జగన్ చేసిన దిశానిర్దేశం ఇది. ప్రత్యేక హోదాపై జగన్ ఎంపీల సమావేశంలో ఇలా హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి ఇపుడు కేంద్రంలో మోడీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చారు. ఆయనకు ఫుల్ మెజారిటీ వచ్చేసింది. ఇక మిత్రులు కూడా దండీగా అండగా ఉన్నారు.


ఏపీలో జగన్ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నా సరే కేంద్రం ఇవ్వకపోవచ్చు. ఓ విధంగా ప్రత్యేక హోదా అన్నది మోడీ ద్రుష్టిలో ఎంతవరకూ పరిశీలనలో ఉందో తెలియదు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకుందామనుకుంటే ఇస్తారు. లేకపోతే లేదు. మరి జగన్ కోసమే హోదా ఇస్తారా, ఆ విధంగా జగన్ని మరింతగా జనంలో పాపులర్ చేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ మాత్రం ప్రత్యేక హోదా మరువక పోవడం, అవసరమైతే రాజీనామాలు అంటూ ముందుకు రావడం గొప్ప పరిణామమే.


మరింత సమాచారం తెలుసుకోండి: