ఎన్టీఆర్ కి జగన్ కి ఎన్నో పోలికలు ఉన్నాయనిపిస్తోంది. ఇద్దరూ కష్ట జీవులే. ఇద్దరూ రాజకీయ పోరాటయోధులే. అలాగే అనుకున్నది సాధించే మొండితనం, పట్టుదల, ఆత్మగౌరవం ఇద్దరిలో ఉంది. ఇద్దరూ తెలుగు వారి నిండు అభిమానం పొందినవారే. ఇద్దరూ కళంకిత రాజకీయాలను అసహ్యించుకున్నవారే. ఇద్దరూ ముక్కు సూటి మనుషులే.


జగన్ విషయమే తీసుకుంటే గోల్డెన్ స్పూన్ లో పుట్టారు. తండ్రి మరణించేటంతవరకూ ఆయనది హాయిగా సాగిన జీవితమే. అటువంటి జగన్ పదేళ్ళ పాటు నానా బాధలు పడ్డారు. రాజకీయాల్లో ఇన్ని కష్టాలుంటాయా అన్నది జగన్ జీవితం చూస్తే తెలుస్తుంది. ఇక అన్న ఎన్టీఆర్ మాత్రం బాల్యంలో కష్టాలు పడ్డారు. కానీ ఆ తరువాత  ఆయన సినీ, రాజకీయ జీవితం చాలాకాలం పాటు పూలపానుపే. తొమ్మిది నెలల పాటు చైతన్య రధంపై  ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన అన్న గారు నాదెండ్ల ఎపిసోడ్ లోనూ విజయం సాధించారు. అయితే తరువాత కాలంలో మాత్రం ఆయన కష్టాలు పడ్డారు.



ముఖ్యంగా కుటుంబం ఆయన్ని దూరం చేసినపుడు, లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లోనూ ఆయన  ఒంటరి అయిపోయారు.  చివరికి సొంత వారి చేతుల్లో పడి అవమానకరంగా పదవి పోగొట్టుకుని మరణించారు. సరే జగన్ విషయంలో అలాంటి కష్టాలు లేకపోయినా ఆయన సైతం రాజకీయ కేసుల మీద జైలుకు వెళ్ళారు. అన్ని బాధలు  అనుభవించారు. అయినా మొక్కవోని ధైర్యంతో  ముందుకు సాగారు. చివరికి విజేతగా నిలిచారు.



అదే అన్న గారి రాజకీయ జీవితంలో మొదట అంతా బాగుంది. చివరి రోజుల్లోనే కష్టాలు పడ్డారు. ఇది ఒక పోలిక అయితే ఇద్దరూ పార్టీని పెట్టి సొంతంగా ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇద్దరు రాజకీయ సునామీలే స్రుష్టించారు. ఇద్దరు అరుదైన రికార్డులే క్రియేట్ చేశారు. 



ఇక వైసీపీ విషయం తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే కేంద్రీక్రుతమైన అధికారాన్ని మూడవ రాజకీయ పార్టీగా సొంతం చేసుకుని చరిత్ర స్రుష్టించింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత అధికారం బదలాయింపు అయిన రెండవ ప్రాంతీయ  రాజకీయ పార్టీగా కూడా రికార్డ్ స్రుష్టించింది. ఇక జగన్ పాలనలో అనుసరించే విధానాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: