టీడీపీ ఓటమి పార్టీ నేతలను ఇంకా షాక్ నుంచి తేరుకోకుండా చేస్తుంది. ఇటువంటి ఫలితాలు వారు కలలో కూడా ఉహించివుండరు. పేపర్ మీద చూసినప్పుడు టీడీపీ అభ్యర్థులంతా ఆర్థికంగానూ.. నెట్ వర్క్ పరంగానూ.. అండ బలం ఎక్కువన్నట్లుగా కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులంతా దారుణమైన ఓటమిని ఎదుర్కొంటూఎలా స్పందించాలో అర్థంకాక మాటల కోసం ఎదుర్కొనే దుస్థితి.


ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు మెంటల్ గా ప్రిపేర్ కాకపోవటం వారిని ఇబ్బందికి గురి చేస్తుంది.అయితే.. దీనికో పరిష్కారాన్ని చూపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన.. బుల్లెట్ వాహనం మీద నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరికి వద్దకువెళ్లి.. తన ఓటమిపై క్షమాపణలు కోరుతున్నారు. ఇప్పటికే ఆయన పెనమలూరు.. కంకిపాడు..కాలువ కట్టలపై బుల్లెట్ పైన ఒంటరిగా బండి మీద వెళుతూ.. ప్రజలను పలుకరిస్తున్న వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


 తానుఏదైనా తప్పు చేస్తే క్షమించాలని కోరుతున్న ఆయన.. తనకు ఓటు వేసినా.. వేయకున్నా  కృతజ్ఞతలు చెప్పటం గమనార్హం. తానేమీ తప్పు చేయకున్నా తనను క్షమించాలని కోరటం విశేషం.  ఓడిపోయామన్న బాధతో బయటకు రాకుండా ఉండే కన్నా.. తెలుగు తమ్ముడు బోడె ప్రసాద్ మాదిరి బయటకు వచ్చి.. ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవటం బాగుంటుందంటున్నారు. మరి.. తెలుగు తమ్ముళ్లు బోడె ప్రసాద్ ను స్ఫూర్తిగా తీసుకుంటారా? 

మరింత సమాచారం తెలుసుకోండి: