సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. దొంగ‌త‌న నేపంతో ఓ వృద్ధుడిపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు పుర‌పాల‌క సంఘం అధ‌కారులు. దొంత‌నం చేశాడ‌న్నఅనుమానంతో ఆ వృద్ధుడిని ఆఫీస్ గేటుకు తాళ్ల‌తో క‌ట్టి నిర్బంధించారు.  ఈ ఘ‌ట‌న బొల్లారంలో చోటు చేసుకుంది. 


కాగా.. బొల్లారంలోని చ‌ర్చి బ‌స్తీలో వాట‌ర్ స‌ప్లాయి చేసే పైపు వాల్వ్ చోరీ జ‌రిగింది. అయితే దొంత‌నం చేసిన వ్య‌క్తి పారిపోయాడు. ఈ క్ర‌మంలోనే అటుగా వెళ్తున్న జంగ‌య్య అనే వృద్ధుపై స్థానికులు అనుమాన‌ప‌డ్డారు. దీంతో వెంట‌నే పారిశుద్ధ్య కార్మికుల‌కు ఫిర్యాదు చేశారు. 


వారి మాటలు న‌మ్మిన పారిశుద్ధ్య ఇన్‌స్పెక్ట‌ర్ విన‌య్ శుక్ర‌వారం ఉద‌యం జంగ‌య్య‌ను తీసుకొచ్చి మ‌రీ తాళ్లతో పురపాలక సంఘం ఆఫీసు గేటుకు గ‌ట్టిగా క‌ట్టారు. ఎండ‌లో అలానే నిల‌బెట్టారు. 


మ‌రోవైపు తానను అకార‌ణంగా తీసుకొచ్చి కార్యాల‌యం గేటుకు తాళ్ల‌తో క‌ట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఆ దొంగ‌త‌నం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అటుగా వెళ్ల‌డ‌మే నేను చేసిన పాప‌మా అంటూ వాపోయాడు బ‌ధితుడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: