సూర‌త్‌లోని కోచింగ్ సెంట‌ర్‌లో శుక్ర‌వారం జరిగిన భారీ అగ్నిప్ర‌మాదంలో 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన ముగ్గురిపై కేసు న‌మోదైంది. భ‌వ‌న య‌జ‌మానితో పాటు కోచింగ్ సెంట‌ర్ నిర్వాహ‌కుడు. బిల్డింగ్‌ను క‌ట్టిన బిల్డ‌ర్లు ఇలా ముగ్గురు పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. 


విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు భ‌వ‌న నిర్మాణంలో లోపాలున్న‌ట్లు గుర్తించారు. స‌రైన అగ్నిమాప‌క ఏర్పాట్లు లేవ‌ని.. అందుకే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు విచార‌ణ‌లో తేలిందని అన్నారు అధికారులు. మ‌రోవైపు కోచింగ్ సెంట‌ర్ ను నిర్వ‌హిస్తున్న 4వ అంత‌స్తుకు కేవ‌లం ఒక వైపు మాత్ర‌మే మెట్లున్నాయ‌ని.. అవి కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.


అయితే ఆ మెట్లు కూడా చెక్కతోనే కట్ట‌డంతో అవి పూర్తిగా క‌లిపోయాయ‌ని.. మెట్లు కాలిబూడిద‌వ్వ‌డంతో విద్యార్థులు త‌ప్పించుకోవ‌డానికి వేరే దారి క‌నిపించ‌కుండా పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. స‌రిగా ఆ టైమ్‌లో విద్యార్థులు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పై నుంచి కింద‌కు  దూకాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని .. దీంతో వారు తీవ్ర గాయాల‌పాలై కొంద‌రు స్పాట్‌లోనే చ‌నిపోయారని అధికారులు చెప్పారు. 


షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా చెల‌రేగిన మంట‌లు ఒక్క‌సారిగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయ‌ని.. అలాగే కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఫోర్త్ ఫ్లోర్‌లో ప్లాస్టిక్ మెటీరియ‌ల్ వాడంతో ప్ర‌మాద తీవ్ర‌త‌ను మ‌రింత పెంచింద‌న్నారు. ఇక  కేవలం సెకండ్ ఫ్లోర్ వ‌ర‌కు మాత్ర‌మే య‌జ‌మాని ఫ‌ర్మీష‌న్ తీసుకున్నార‌ని.. థ‌ర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లు చ‌ట్ట విరుద్ద‌మ‌ని తెలిపారు. 


ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్థానికులు అధికారుల‌కు స‌మాచారం అందించినా.. వెంట‌నే వారు రెస్పాండ్ కాలేద‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన అనంత‌రం సంఘట‌నా స్థలాన్ని సీఎం విజ‌య్ రూపానీ సంద‌ర్శించారు. మృతుల కుటుంబాల‌కు రూ.4ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న విద్యా సంస్థ‌లు, కోచింగ్ సెంట‌ర్లు, దుకాణ స‌ముదాల్లో అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయో లేదో ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: