వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్ర‌భంజనంలో ఏపీలో సైకిల్ చిత్తు చిత్తు అయ్యింది. ఫ్యాన్ ప్ర‌భంజనం ముందు టీడీపీ ఎక్క‌డా క‌నీస పోటీ కూడా ఇవ్వలేక‌పోయింది. ఏకంగా 153 ఎంపీ సీట్లు, 22 ఎమ్మెల్యే సీట్లు సాధించింది. ఈ క్ర‌మంలోనే మ‌హామ‌హులు కూడా కొట్టుకుపోయారు. సైకిల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ టీడీపీ కేవ‌లం నాలుగు సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇదిలా ఉంటే జ‌గ‌న్ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకుని గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొంత‌మంది ఎమ్మెల్యేలు వ‌రుస‌గా రెండోసారి గెలిస్తే, మ‌రికొంద‌రు మాత్రం హ్యాట్రిక్ కొట్టారు.. కొంద‌రు నాలుగోసారి గెలిస్తే చంద్ర‌బాబు లాంటి వాళ్లు ఏడోసారి గెలిచారు.


ఇచ్ఛాపురంలో గెలిచిన బెందాళం అశోక్‌, టెక్క‌లిలో అచ్చెన్నాయుడు గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ గెలిచారు. అచ్చెన్న గ‌తంలో కూడా గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక విశాఖ తూర్పులో వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు హ్యాట్రిక్ కొట్టారు. నార్త్‌లో గంటా ఐదోసారి గెలిస్తే, ద‌క్షిణంలో వాసుప‌ల్లి గ‌ణేష్‌, ప‌శ్చిమంలో గ‌ణ‌బాబు వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. గ‌ణ‌బాబు గ‌తంలో పెందుర్తి నుంచి కూడా గెలిచారు. ఇక తూర్పులో మండ‌పేట‌లో వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు హ్యాట్రిక్ కొట్టారు. పెద్దాపురంలో చిన‌రాజ‌ప్ప రెండోసారి గెల‌వ‌గా... సీనియ‌ర్ బుచ్చ‌య్య రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్‌లో వ‌రుస‌గా రెండోసారి, సిటీలో ఆదిరెడ్డి భ‌వానీ తొలిసారి గెలిచారు.


ప‌శ్చిమ‌లో పాల‌కొల్లులో నిమ్మ‌ల రామానాయుడు వ‌రుస‌గా రెండోసారి... ఉండిలో కొత్త క్యాండెంట్ మంతెన రాంబాబు తొలిసారి గెలిచారు. కృష్ణా నుంచి గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ తూర్పులో వ‌ల్ల‌భ‌నేని వంశీ, గ‌ద్దె రామ్మోహ‌న్ వ‌రుస విజ‌యాలు సాధించారు. గుంటూరులో రేప‌ల్లెలో అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వ‌రుస‌గా రెండోసారి, గుంటూరు ప‌శ్చిమంలో మ‌ద్దాలి గిరి తొలిసారి గెలిచారు. ప్ర‌కాశంలో ప‌ర్చూరు, కొండ‌పిలో ఏలూరి సాంబ‌శివ‌రావు, స్వామి వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. 


చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రాం 2004 త‌ర్వాత ప‌దిహేనేళ్ల‌కు మ‌ళ్లీ గెలిస్తే... అద్దంకిలో గొట్టిపాటి ర‌వికుమార్ హ్యాట్రిక్‌తో పాటు ఓవ‌రాల్‌గా నాలుగోసారి గెలిచారు. ఇక సీమ‌లో బాల‌య్య హిందూపురంలో వ‌రుస‌గా రెండోసారి మంచి మెజార్టీతో గెలిచారు. కుప్పంలో బాబు ఏడోసారి గెలిచినా మెజార్టీ చాలా త‌గ్గిపోయింది. ఇక తాను గెలిస్తే ఏపీలో పార్టీ గెల‌వ‌దు అన్న సెంటిమెంట్ నిజం చేస్తూ ఉర‌వ‌కొండ‌లో ప‌య్యావుల కేశ‌వ్ త‌క్కువ మెజార్టీతో గెలిచారు. ఏదేమైనా టీడీపీలో వీరితో పాటు గ‌ల్లా జ‌య‌దేవ్‌, కేశినేని నాని, రామ్మోహ‌న్ నాయుడు ఎంపీలుగా గెలిచి వీళ్లు మాత్ర‌మే మొన‌గాళ్లు అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: