Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:59 pm IST

Menu &Sections

Search

జగన్‌కి, రత్నప్రభ అభినందనలు

జగన్‌కి, రత్నప్రభ అభినందనలు
జగన్‌కి, రత్నప్రభ అభినందనలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, రేపటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారికి, మాజీ ఐఎఎస్‌ అధికారి కె. రత్నప్రభ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.
తండ్రి వై.ఎస్‌ లాగే జనరంజకంగా జగన్‌ పరిపాలించగలరని అకాంక్షించారు.

జగన్‌ విజయం సాధించన రోజే, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకు నిజంగా శాంతి చేకూరి ఉంటుందని రత్న ప్రభ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. సుపరిపాలనకు వైఎస్‌ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారని అన్నారు.

తాను పనిచేసిన అత్యద్భుత ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటారని వైఎస్‌తో ఒక సమావేశంలో పాల్గొన్న ఫొటోను షేర్‌ చేశారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్‌ శరవేగంతో నిర్ణయాలు తీసుకునే వారని, ఆయన ఆలోచనలన్నీ అత్యున్నతమైనవని, అలాంటి నాయకుడి కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరింతగా ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు. 2009 సెప్టెంబర్‌ 2వ తేదీన డైనమిక్‌ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారని గుర్తు చేసుకున్నారు.

పదేళ్లు తిరగక ముందే- ఆయన కుమారుడు అధికారంలోకి వచ్చారని చెప్పారు. కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారిణి రత్నప్రభ. సుధీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పనిచేశారు. ఐటీ వంటి కొన్ని కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పరిపాలనను ఆమె దగ్గరి నుంచి చూశారు.

ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో వివాదాలు ఆమెను చుట్టుముట్టి నప్పటికీ, ఆ సమస్యల నుండి ఆమె బయట పడ్డారు.కర్నాటక ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ,సామాజిక కార్య క్రమాల్లో పాల్గొంటున్నారు. 


ratnaprabha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగు దర్శకుడి అక్రమ నిర్మాణం కూల్చివేత !!
  '' మల్లేశం''  ఎందుకు చూడాలి ?
 '' జగన్‌ మంచిగ చేస్తుండు !!''- గోరేటి ఎంకన్న
ఆయన రాత్రి ఉదయిస్తున్న రవి...
ఆ పత్రిక ఎడిటర్‌ ఔట్‌ ...?
జగన్ కి కేశినేని నాని సలహా ?
హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?
'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు ...? ''
అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!
హై టెక్ సిటీలో ఉద్యోగం కావాలా ?
హీరొ రవితేజ ఇక్కడే ఎందుకు భోజనం చేస్తాడో తెలుసా...?
'' వైఎస్‌ జగన్‌ అనే అతడు...'' అని, ఆ పత్రికలో ఎందుకు రాశారంటే..?
జగన్‌ ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఎందుకు వేశారో తెలుసా?
వంద కోట్ల పరువు నష్టం దావా...?
గ్రామ స్వరాజ్యం కోసం,చినజీయర్ స్వామి ?
హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం !!
 ఈ డ్యామ్‌ లేకపోతే, అమెరికాలో పంటలు పండవు... !!
ఆ జర్నలిస్టుల వల్ల ఏపీకి, అరకోటి నష్టం!!
డాక్ట‌ర్ల‌కు 'ల‌య‌న్స్ క్ల‌బ్ ' సంఘీభావం
గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా మందులు!!
 పేద విద్యార్థులకు ఉచిత వసతి, నైపుణ్యశిక్షణ!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.