బాబోరి మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అవ‌స‌రానికి ఎవ‌రిని అయినా వాడుకుని వ‌దిలేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఈ విష‌యంలో బాబు పీహెచ్‌డీ చేసి ప‌డేశాడు. ఇంకా ఎన్ని పీహెచ్‌డీలు అయినా చేసేస్తాడు. నంద‌మూరి ఫ్యామిలీ బాబుకు దెబ్బ‌కు కుదేలైపోయింది. బాల‌య్య ఉన్నా ఆయ‌న ఓ డ‌మ్మీనే. బావ‌కు ఎదురు చెప్పే సాహ‌సం చేయ‌లేడు. ఇక నంద‌మూరి ఫ్యామిలీలో 2009 ఎన్నిక‌ల‌కు ఎన్టీఆర్‌ను వాడుకుని ప‌క్క‌న పెట్టాడు.. ఇక గ‌త తెలంగాణ ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ చ‌నిపోతే ఆ సానుభూతి కోసం ఆయ‌న కుమార్తె సుహాసినిని తీసుకువ‌చ్చి కూక‌ట్‌ప‌ల్లిలో పెట్టి ఓడించాడు.


అదే సుహాసినికి ఏపీలో ఏ ఎమ్మెల్సీయో లేదా ఇత‌ర ప‌ద‌వో ఇస్తే ఎంత అందంగా ఉండేది. హ‌రికృష్ణ ఫ్యామిలీకి న్యాయం చేసిన‌ట్లు ఉండేది. ఇక తాజా ఎన్నిక‌ల్లో త‌న కుమారుడి తోడ‌ళ్లుడు భ‌ర‌త్‌ను విశాఖ ఎంపీ బ‌రిలోకి దింపినా.. తెర‌వెన‌క బాబు మాత్రం జ‌న‌సేన అభ్య‌ర్థికి ప‌నిచేయాల‌ని సంకేతాలు పంపార‌ని టాక్‌. అక్క‌డ భ‌ర‌త్ ఓడిపోయాడు. ఇక బాబు ఇన్నీ రాజ‌కీయాలు చేస్తే జ‌నాలు ఊరుకుంటారా ? అందుకే మంగ‌ళ‌గిరిలో ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను ఓడించారు. బాబు మెజార్టీ చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. ఇక బాల‌య్య ఎంత‌మందిని కొట్టినా... తిట్టినా మ‌న‌స్త‌త్వం వేరు కాబ‌ట్టి హిందూపురంలో గెలిచిపోయాడు.


ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు ఓ కుర్రాడి భ‌విష్య‌త్తుతో ఆట‌లు ఆడుకున్నాడు. అత‌డే తాజా మాజీ మంత్రి కిడారి శ్ర‌వ‌ణ్‌కుమార్‌. తండ్రి కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు గ‌త ఎన్నిక‌ల్లో అర‌కు నుంచి వైసీపీ త‌ర‌పున గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీ మార‌డం.. న‌క్స‌లైట్ల చేతిలో చ‌నిపోవ‌డం జ‌రిగింది. ఆ సానుభూతి క్యాష్ చేసుకునేందుకు చంద్ర‌బాబు ఉన్న‌త చ‌దువులు చ‌దివిని ఆయ‌న కుమారుడు శ్ర‌వ‌ణ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. కేవ‌లం ఆరు నెల‌ల ప‌ద‌వి కోసం ఎంతో హంగామా చేసిన బాబు శ్ర‌వ‌ణ్‌ను ఈ ఎన్నిక‌ల్లో అర‌కు నుంచి పోటీ చేయిస్తే... అక్క‌డ ఆయ‌న చిత్తుగా ఓడిపోవ‌డంతో పాటు ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్ తెచ్చుకుని చెత్త రికార్డు మూట‌క‌ట్టుకున్నారు.


క‌నీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌కుండా ఆరు నెల‌ల కాలానికి మంత్రిని చేయ‌డం.. ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో శ్ర‌వ‌ణ్ భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింది. అర‌కులో పోలైన ఓట్ల‌లో డిపాజిట్ ద‌క్కాలంటే 26 వేల ఓట్లు రావాల్సి ఉండ‌గా.. శ్ర‌వ‌ణ్‌కు కేవ‌లం 19 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అక్క‌డ ఇండిపెండెంట్ ద‌న్నుదొర‌కు 27 వేల ఓట్లు తెచ్చుకున్నారు. విశాఖ మ‌న్యంలో వైసీపీ బ‌లంగా ఉంది.. అక్క‌డ పార్టీ త‌ర‌పున ఎవ‌రు నిల‌బ‌డినా ఓడిపోతారు. అలాంటిది శ్ర‌వ‌ణ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా స‌రిపోయేది... కానీ బాబు మాత్రం ఎమ్మెల్యే సీటు ఇచ్చి మ‌రీ ఓడించిన‌ట్ల‌య్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: