ఇప్పటివరకు రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పరస్పరం విభేదాలు ఉండేవి. నిత్యం గొడవలతో చాలా పనులు ఆగిపోయాయని తెలిసిందే. అయితే ఇప్పుడు కథ మారింది. ఏపీలో జగన్ సీఎం అయ్యారు.  ఏపీతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. ‘గోదావరి నది నుంచి ఏటా 3,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టీఎంసీలను మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఏపీ వాడుకునే వీలుంది.


ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు’ అని జగన్‌కు సీఎం కేసీఆర్ చెప్పారు. కేవలం రెండు లిఫ్టులతోనే గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించవచ్చని.. రైతులకు సాగునీరు ఇవ్వవచ్చని జగన్‌తో కేసీఆర్ అన్నారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.


 ‘ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నాం. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ – మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడాను’ అని జగన్‌తో సీఎం కేసీఆర్ అన్నారు. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని మహారాష్ట్ర సీఎంకు చెప్పానని.. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని వివరించానని జగన్‌తో కేసీఆర్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: