లగడపాటి రాజగోపాల్ గా రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎంపీ అయిన తరువాత విభజన సమయంలో ఆయన చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. ఒక్క బాల్ అంటూ అప్పటి సీఎం కిరణ్ ఊదరగొడితే విభజనను ఆపేస్తామంటూ లగడపాటి చేసిన శపధాలు జనాలకు గుర్తుండే ఉంటాయి. ఆ తరువాత ఏపీ ఎటూ విడిపోయింది.


ఇక నాటి నుంచి లగడపాటి సర్వేలు మరింత ఎక్కువగా చేయిస్తూ ప్రత్యేకించి టీడీపీకి వెన్నుదన్నుగా మారిపోయారు. ఆయన చంద్రబాబుకు అత్యంత ఆంతరీకునిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన్ని చంద్రబాబు ఎంతలా నమ్మారంటే నూటికి వేయి శాతం గెలుస్తామని చెప్పింది లగడపాటి సర్వేను చెతిలో పెట్టుకునే. మనమే వస్తున్నమంటూ లగడపాటి చెప్పినదాన్ని వల్లె వేసిన బాబు చివరకు ఘోర పరాభవం చవిచూడాల్సివచ్చింది.


అభ్యర్ధులంతా ఓడిపోతున్నారని అన్ని సర్వేలు చెబితే లగడపాటి పసుపు కుంకుమ, పించన్లు అంటూ ఏవో డేటా ముందేసుకుని టీడీపీని మభ్యపెట్టాడు. ఇక ఎన్నికల ఫలితాలు రాకముందే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లగడపాటిని దారుణంగా విమర్శించిన సంగతి విధితమే. ఏసీ  రూముల్లో కూర్చుని చెత్త సర్వేలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నీ  సర్వేల‌ వల్ల బెట్టింగులు కట్టి ఎంతో మంది జీవితాలు కోల్పోయారని కూడా నిందించారు.


ఓ విధంగా తమ అధినేత లగడపాటిని నమ్మి మోస‌పోఅయారని అప్పటికే గ్రహించిన అయ్యన్న ఆలా పరుషపదజాలం ఉపయోగించారు. చివరికి ఇపుడు టీడీపీ తలెత్తుకోలేని విధంగా లగడపాటి సర్వే మభ్యపెట్టిందని అంటున్నారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునే లగడపాటి తన సర్వే మాయాజాలంతో నిండా ముంచేశారని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. రాజ్యసభ సీటు కోసం మొత్తం పార్టీని లగడపాటి ఫల్టీ కొట్టించారని గొల్లుమంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: