నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతున్నారు. అల ఇలా కాదు, విపరీతమైన బలంతో రెండవమారు అధికారం సంపాదించారు. ఆయన్ని ఇందిరాగాంధితో పోలుస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఆమె పవర్ ఫుల్  పొలిటికల్ లేడీ, ఇపుడు దేశ రాజకీయాల్లో మోడీని మించిన మొనగాడు లేడు. అటువంటి మోడీ చేతులను మరింత బలోపేతం చేశారు ఓట్లు వేసి ప్రజలు.



అసలు విషయం ఏంటి అంటే ఇవాళ జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. మోడీని కలసి గ్రీట్ చేయడం కోసం. ఇదొక్కటే కాదు, ఏపీని ఆదుకోవాలని జగన్ కోరబోతున్నారు. ఏపీకి సంబంధించి ఇపుడు ఆర్ధికంగా పెను సవాళ్ళు ఉన్నాయి. వాటి వల్ల కేంద్రం ఇచ్చే నిధులు తప్పకుండా అవసర‌మవుతాయి. అందుకే తన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా తీసుకువెళ్తున్నారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని కోరబోతున్నారు.


ఇవన్నీ బాగానే ఉన్నా మోడీ మాట వింటారా అన్నదే ఇక్కడ పెద్ద డౌట్. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏపీకి న్యాయం చేస్తామని చెప్పిన మోడీ మొదటి అయిదేళ్ళలోనే మాట వినలేదు. ఇపుడు ఇంకా మెజారిటీ పెరిగింది. దాంతో ఆయన ఏపీని అసలు ఖాతర్ చేస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా జగన్ తన బాధ్యతగా మోడీని కలుస్తున్నారనుకోవాలి. మోడీ సైతం ఇదివరకులా కాకుండా విడిపోయిన ఏపీ కష్టాలను గుర్తించి తగిన సహాయం చేస్తే తెలుగువారు కూడా హర్షిస్తారు.
.


మరింత సమాచారం తెలుసుకోండి: